Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సమ్మర్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ -వాటర్ మెలోన్ దోస
వేసవి కాలం వచ్చేస్తోంది...కాదు కాదు వచ్చేసింది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసిన పుచ్చకాయలే..వేసవి తాపాన్ని తీర్చే వాటర్ మెలోన్. వేసవి తాపానికి మాత్రమే కాదు.. ఇది ఆరోగ్యానికి కూడా అద్భుతమైన బెనిఫిట్స్ నుఅంధిస్తుంది. ఇందులో పోషకాంశాలతో పాటు అత్యధికంగా నీటి శాతం కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి కావల్సినంత నీరు అందజేయడమే కాదు..చర్మానికి కావల్సినంత హైడ్రేషన్ అందుతుంది.
వాటర్ మెలోన్ వివిధ రకాలుగా తింటారు.సలాడ్ గాను, జ్యూస్ గాను తీసుకుంటారు. ఇవి మాత్రమే కాకుండా వాటర్ మెలోన్ తో దోసె కూడా తయారు చేయవచ్చు.రెగ్యులర్ దోస బోరు కొడుతుంటే ఈ వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయతో దోసె తయారు చేసి ఓ కొత్త రుచిని టేస్ట్ చేయండి. రుచితో పాటు హెల్త్ బెనిఫిట్స్ పొందండి.

కావల్సిన పదార్ధాలు:
బియ్యం : 1cup
కర్జూజ/పుచ్చకాయ తరుము: 2cups(పుచ్చకాయలోని తెల్లగి బాగాన్ని తురుముకోవాలి)
పచ్చిమిర్చి: 2
జీకలర్ర: 2
ఇంగువ : చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్: తగినంత(మీకు అవసరం అయితేనే)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. పుచ్చకాయలోని తెల్లని పదార్థాన్ని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత వాటర్ మెలోన్ తురుము నుండి నీటిని పిండిసి, పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు నానబెట్టుకొన్ని బయ్యాన్ని తీసుకొని , నీరు వంపేసి గ్రైండర్ వేయాలి, బియ్యంతో పాటు,పచ్చిమిర్చి, ఇంగువ మరియు వాటర్ మెలోన్ తురుము వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
4. పుచ్చ కాయ తురుమును బియ్యం పిండిలో కలపడం వల్ల ఇడ్లీ పిండిలా చిక్కగా పేస్ట్ తయారుఅవుంది.
5. తర్వాత ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ కావల్సినంత మిక్స్ చేసుకోవాలి. ఈదోసె మిండి మిశ్రమాన్ని 4-5గంట తర్వాత దోసె వేసుకోవాలి(ఈ పిండి రుబ్బిన వెంటనే కూడా దోసె వేసుకోవచ్చు. అయితే కొద్దిగా పులిస్తే మంచి టేస్ట్ ఉంటుంది.
6. ఇప్పుడు స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, వేడయ్యాక ఆనియన్ ముక్కతో కొద్దిగా నూనె రాయాలి.
7. తర్వాత వెంటనే దోసపిండి పోసి, పాన్ మొత్తం సర్ధాలి. తర్వాత ఒక చెంచా నూనె చిలకరించాలి.
8. దోసె ఒకవైపు కాలిన తర్వాత, మరోవైపు తిప్పి రెండో వైపుకూడా(లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ) కాలేవరకూ ఉండనిచ్చి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి. ఈ దోసెను మనం రెగ్యులర్ గా తయారు చేసే దోసెలాగా రాదు,దీని ఆకారం ఊతప్పంలా ఉంటుంది . ఈ వేడి వేడి వాటర్ మెలోన్ దోసను ఏదైనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా వెరైటీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications