Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హోళీ స్పెషల్: ఆచారి పనీర్ రిసిపి
హోళీ స్పెషల్ వంటలకు మీరు రెడీనా?మీ మెనులో మరో స్పెషల్ డిష్ ను చేర్చుకోండి. అదే అద్భుత రుచి కలిగిన ఆచారి పనీర్ . ఈ ఫెస్టివల్ సీజన్ లో మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సినటువంటి ఒక కమ్మని రుచి కలిగిన రిసిపి ఇది ఆచారీ పనీర్ కొద్దిగా పికెల్ పనీర్ వంటిది. ఎందుకంటే, ఈ పనీర్ వంట యొక్క గ్రేవీని పికెల్ మసాలా,నూనెతో తో తయారుచేస్తారు.
ఆచారీ పనీర్ మంచి ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది . ఇది స్పైసీ మరియు ట్యాంగీ టేస్ట్ ను కలిగి ఉంటుంది . ఈ రుచి మీ టేస్ట్ బడ్స్ ను మరింత క్రేజీగా మార్చేస్తుంది. మరి మీరు కూడా ఈ హోళీ సందర్భంగా స్పెషల్ వంటను టేస్ట్ చూడాలంటే ఎలా తయారుచేయాలో చూడాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
పనీర్-500gms
కాప్సికమ్: 1 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2
వెల్లుల్లి: 5-6
అల్లం: 1 మీడియం ముక్క
టమోటోలు : 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
Amchoor (డ్రై మామిడి పొడి): 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి : 1tsp
పసుపు: 1tsp
గరం మసాలా పొడి: ½ tsp
కారం ½tsp
Kalonji (ఉల్లిపాయ విత్తనాలు): నచ్చిన 1tsp
ఆవాలు ½ tsp
బిర్యానీ ఆకు 1
ఉప్పు: రుచికి సరిపడా
ఊరగాయ మసాలా: 1tbsp
ఆయిల్: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగాతరిగినది)
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, టమోటో, పచ్చిమిర్చి, అల్లం మరియు వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో కలోంజి, ఆవాలు, బిర్యానీ ఆకు, వేసి కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి .
4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మీడియం మంట మీద 5-6నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాలపొడి, డ్రై మ్యాంగో పౌడర్, గరం మసాలా, వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు పికెల్ ఊరగాయ మసాలా(నూనెను)వేయాలి. అయితే ఊరగాయ ముక్కలు అందులో పడకుండా జాగ్రత్తపడాలి. వేసిన తర్వాత రెండు మూడు నిముషాలు వేగించాలి.
7. ఇప్పుడు అందులో పనీర్ ముక్కలు మరియు ఉప్పు వేసి 3,4నిముషాలు వేగించుకోవాలి.
8. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి.
9. పనీర్ పూర్తిగా ఉడికిన తర్వాత, మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పుల్లని మరియు స్పైసీ ఆచారి పనీర్ రెడీ .



Click it and Unblock the Notifications











