Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
హానీ చిల్లీ పొటాటో హెల్తీ అండ్ టేస్టీ
మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉండే సీజన్ ఇది. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, టర్నిప్ మరియు ఇతర గ్రీన్ వెజిటేబుల్స్ ఈ సమంయలో మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి, ఈ సౌకర్యాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఈ పూర్తి పోషకాల యొక్క ఆహారాలతో మీ ప్లేట్స్ ను నిండుగా నింపేయండి. ఈ రోజు, మీకోసం ఒక సింపుల్ మరియు రుచికరమైన రిసిపిని మీ ముందు ఉంచుతున్నాం.
పొటాటో స్నాక్స్ ఇతర స్నాక్స్ కంటే ప్రత్యేకమైనవి. పొటాటో స్నాక్స్ ను చూడగానే నోరూరుతుంది. క్రిస్పీగా, టేస్టీగా ఉండే పొటాటో స్నాక్స్ పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. అందుకే పొటాటో స్నాక్స్ రెసిపీ తెలుసుకుందాం. ....

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4
కార్న్ ఫ్లోర్ లేదా మైదా: 8tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 2tsp
ఉల్లికాడలు: 4
క్యాప్సికమ్: 2
వెల్లుల్లి ముద్ద: 2tbsp
నువ్వులు: 2tbsp
తేనె: 2tbsp
సోయాసాస్: 1/2tbsp
చిల్లీ సాస్: 4tsp
నూనె సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల పొట్టు తీసి సన్నగా పొడవాటి ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నె లో కార్న్ ఫ్లోర్ లేదా మైదా, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇందులో ఆలూ ముక్కలు వేసి దొర్లించాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కొంచెంకొంచెంగా కాగిన నూనెలో వేయించి తీసి పక్కన ఉంచాలి.
4. ఇప్పుడు అదే పాన్ కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగి తర్వాత ఉల్లికాడలు వేసి మరో నిముషం వేగించుకోవాలి.
5. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు, తేనె, ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్ వేసి ఓ నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు వేయించి ఉంచిన బంగాళదుంప ముక్కలు, నువ్వులు కూడా వేసి కలిపి దింపేసుకోవాలి. అంతే హనీ చిల్లీ పొటాటో రెడీ...



Click it and Unblock the Notifications