Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కారా పొంగల్ టేస్టీ అండ్ హెల్తీ
కారం పొంగలి సెమీ లిక్విడ్ పొంగల్. దీన్ని బియ్యం పెసరపప్పుతో వండుతారు. పొంగల్ అంటే స్వీట్ పొంగల్ మరియు కారం పొంగల్ రెండు వండుతారు.
కారం పొంగలి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిపిలలో చాలా ఫేమస్. తయారు చేయడం కూడా సులభం మరియు చాలా సింపుల్ రిసిపి. కారం పొంగల్ కొబ్బర్ చట్నీ లేదా సాంబార్ తో మంచి కాంబినేషన్. మరి కారా పొంగల్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం..

కావలసిన పదార్థాలు:
బియ్యం : 1 కప్పు,
పెసరపప్పు : ముప్పావు కప్పు,
పసుపు : అర టీ స్పూను,
బెల్లం : 1 టీ స్పూను,
నిమ్మరసం : 1 టీ స్పూను,
పాలు : 1 కప్పు,
కొబ్బరి తురుము : అరకప్పు,
కొత్తిమీర తరుగు : పావు కప్పు,
ఉప్పు : రుచికి తగినంత,
తాలింపు కోసం : నెయ్యి / నూనె,
ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు తగినంత.
తయారు చేయు విధానం:
1. ముందుగా మిరియాలు, జీలకర్ర దోరగా వేగించి మెదపాలి.
2. తర్వాత వేగించిన పెసరపప్పు, బియ్యంలో తగినంత నీరు పోసి 3 విజల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
3. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి నేతిలో తాలింపు వేగాక ఉడికిన పెసరపప్పు మిశ్రమం కొద్ది సేపు వేగించి కొబ్బరి కోరు, పసుపు, బెల్లం, పాలు, దంచిన మిరియాలు, జీలకర్ర కలిపి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు నిమ్మరసం, ఉప్పు కలపాలి. అంతే కారపొంగల్ రెడీ...



Click it and Unblock the Notifications











