Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
రొటీన్ కు కొంచెం భిన్నంగా బెండకాయ ఫ్రై
సహజంగా వెజిటేబుల్స్ తో వివిధ రకాల వెరైటీ వంటలను తయారు చేస్తుంటారు. అయితే వంకాయ్ టమాట.. పాలక్ దాల్.. బీరకాయ పెసరపప్పు.. ఇట్లా ఎప్పుడూ ఒకే టైప్ కాంబినేషన్స్ తినడానికే కాదు.. వండడానికి కూడా బోర్! మరందుకే వండడానికే కాదు, తినడానికీ కొత్త కాంబినేషన్స్‌తో బెండకాయ పీనట్ ఫ్రై తయారు చేయవచ్చు. బెండకాయతో వేపుడు, కర్రీ వంటివి తయారు చేస్తుంటారు. ఈ రిసిపిలు సౌత్ ఇండియాలో ఎక్కువగా వండుతుంటారు. ఈ బెండకాయ ఫ్రై ను రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా పీనట్స్ వేసి తయారు చేస్తారు. రుచికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఇండియన్ మసలా దినుసులు వేయడం వల్ల మంచి రుతితో పాటు, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
బెండకాయలు : 1/2kg
పల్లీలు : 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిరపకాయలు : 2(మద్యకు కట్ చేసుకోవాలి)
ఆవాలు : 1/2tsp
శనగపప్పు : 1/2tsp
మినపప్పు : 1/2tsp
జీలకర్ర : 1/2tsp
కరివేపాకు : 2 రెమ్మలు
జీలకపూరపొడి : 1/2tsp
ధనియాల పొడి : 1tsp
పసుపు : 1/4tsp
కారం : 1tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
కొత్తిమీర తరుగు: 1cup
నూనె: సరిపడా
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా బెండకాయలను కడిగి, తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఆ తర్వాత కొంచెం పాన్ లో నూనె వేడయ్యాక అందులో బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
4. తర్వాత పసుపు, జీలకపూరపొడి, ధనియాలపొడి, కారం వేసి మరి కాసేపు కలపాలి. తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను, పల్లీలను వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. బెండీ పీనట్ ఫ్రై రెడీ!



Click it and Unblock the Notifications