Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కోకనట్ మ్యాంగో చట్నీ : వెజిటేరియన్ వంటలు
వేసవిలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటివారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లటివైతే పప్పులో వేసుకుంటారు. కాస్త పులుపు తక్కువగా ఉంటే ప్లేట్లో ఉప్పు, కారం వేసుకుని లాగిచేస్తారు. కాయలు పళ్లయ్యేవరకూ ఆగడమంటే చాలా కష్టం. రెండు కాయలందుకుంటే గాని మనసు ఊరుకోదు.
పచ్చిమామిడి. ఆ పులుపు తలచుకుంటేనే నోరూరుతుంది. ఈ ఏడాది తొలి మామిడికాయ భలే పుల్లగా ఉంది.మామిడికాయతో ఎలా పచ్చడి. చేసినా ఇష్టమే. చేసీచేసీ నాకు విసుగురావాలే కానీ రోజూ చేసినా తింటారు మా ఇంట్లో. అందుకే మొదటగా కొబ్బరితో కలిపి ఈ పచ్చడి చేశాను.

కావల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుయు: 1/2cup
మామిడికాయ తురుము: 1/2
పచ్చిమిర్చి: 5-8
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/4tsp
పుల్లపుల్లని పచ్చిమామిడికాయలోని 14 ఆరోగ్య ప్రయోజనాలు
ఇంగువ: చిటికెడు
నూనె: 2tbps
కరివేపాకు: రెండు రెమ్మలు
ఎండుమిర్చి: 4-5
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
శెనగపప్పు: 1tsp
మినపప్పు: 1tsp
బేబీ స్కిన్ పొందడానికి మ్యాంగో హోం రెమెడీస్
తయారుచేయు విధానం:
1. ముందుగా కొబ్బరిని తురుమిని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమామిడికాయ తొక్క తొలగించి తురుమి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొబ్బరి, మామిడికాయ తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించుకోవాలి.
4. పోపు వేగిన తర్వాత పచ్చడిని తీసి పోపులో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేసి మిక్స్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications