Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
మామిడికాయ-పుదీనా చట్నీ: సమ్మర్ స్పెషల్
వేసవికాలంలో ఎండ, వేడి వల్ల శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్ అయి, బాడీ కూడా వేడి చేస్తుంది . అటువంటి పరిస్థితిలో మీ శరీరానికి చల్లదనాన్ని కలిగించే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ హీట్ ను బీట్ చేయడానికి కూలింగ్ పదార్థాలు ఎంపిక చేసుకోవాలి.
శరీరానికి చల్లదనం కలిగించే అటువంటి ఆహారాల్లో పుదీనా ఒకటి . సమ్మర్ డైట్ లో తప్పనిసరిగా పుదీనా చేర్చుకోవడం ఒక బెస్ట్ ఐడియా. మరి వేసవిలో విరివిగా లభించే పచ్చిమామిడి మరియు పుదీనా కాంబినేషన్ లో పుదీనా చట్నీ తయారుచేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి వెల్లుల్లి రెబ్బలు మరింత టేస్ట్ ను అందిస్తాయి. మరియు మీ శరీరాన్ని కూల్ గా ఉంచుతాయి. మరి ఈ స్పెషల్ మ్యాంగ్, మింట్ చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పచ్చిమామిడికాయ : 1(మీడియం సైజ్)
పుదీనా: 1కట్ట
వెల్లుల్లి రెబ్బలు: 4
బ్లాక్ సాల్ట్: 1/2tsp
పచ్చిమిర్చి: 3
జీలకర్ర పొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చిమామిడికాయను శుభ్రంగా కడిగి తేమ తుడిచేసి, పీలర్ తో పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
2. తర్వాత పుదీనా ఆకులను విడిపించి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పచ్చిమామిడికాయ ముక్కలు, పుదీనా ఆకులు మరియు వెల్లుల్లి రెబ్బులు అన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.
4. కొద్దిగా నీళ్ళు కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోనికి మార్చుకొని దానికి ొకద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలి
5. అవసరం అయితే పోపు పెట్టుకోవచ్చు లేదా అలాగే కూడా తినవచ్చు. ఉప్ప సరిచూసుకొని సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో మింట్ చట్నీ రెడీ . ఈ కూలింగ్ చట్నీని మీల్స్ లేదా స్నాక్స్ తో తిని ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications