మామిడి-రవ్వ పులిహోర

Mango and Rava Pulihora
కావలసిన పదార్థాలు:
పచ్చిమామిడికాయ తురుము: 2cups
బియ్యం రవ్వ: 4cups
ఆవాలు: 2tsp
శెనగపప్పు: 2tsp
మినప్పప్పు: 2tsp
వేరుశెనగ పప్పు: 4tsp
జీడిపప్పులు: 10
పచ్చిమిర్చి: 8
ఎండుమిర్చి:4
ఇంగువ, పసుపు: 2tsp
కరివేపాకు: 4రెబ్బలు
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:
1. ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ, నాలుగు టీసూప్న నూనె, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి.
2. తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో తగినంత నూనె వేసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ పప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పులను వేసి దోరగా వేయించాలి.
4. ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా వేసి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమంలో మొదటగా ఉడికించి సిద్దం చేసి పెట్టుకొన్న బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి. అంతే కమ్మగా, పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర రెడీ దీన్ని అలాగే వేడి వేడిగా తింటే చాలా రుచిగా వెరైటీగా ఉంటుంది.

Story first published: Thursday, April 22, 2010, 12:36 [IST]
Desktop Bottom Promotion