Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మసాలా ఆలూ ఫ్రై: సింపుల్ సైడ్ డిష్
వర్షాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది ఈ ఫర్ ఫెక్ట్ వాతారణానికి ఫర్ ఫెక్ట్ గా ఆహారం తీసుకోవాలని అనిపిస్తున్నదా? చలికి కారంగా ఏదైనా సైడ్ డిష్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే మసాలా ఆలూ ఫ్రై ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్.
మసాలా ఆలూ ఫ్రై సైడ్ డిష్ చాలా సులభంగా, సింపుల్ గా తయారుచేయవచ్చు. చాలా తక్కువ మసాలా దినుసులతో క్రిస్పీగా కరకరలాడే ఆలూ ఫ్రై సాంబార్, రసం, చారు వంటి మీల్ డిష్ కు ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్ గా నప్పుతుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజ్ మసాలా ఆలూ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు: 2 (ఒలిచిన మరియు కావల్సిన సైజ్ లో తరిగినవి)
కారం: 1tsp
పసుపు: ½ tsp
వాము-½ tsp
పచ్చిమిర్చి :2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
ఛాట్ మసాలా: 1tsp
నూనె: 2tbps
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో అజ్వైన్ విత్తనాలు వేసి ఒక నిముషం వేగించాలి తర్వాత చిటికెడు కారం కూడా వేసి ఫ్రై చేయాలి.
2. ఇప్పుడు బంగాళదుంప ముక్కల మీద కారం, పసుపు, ఛాట్ మసాలా మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇలా మసాలాలతో మిక్స్ చేసి పెట్టుకొన్న బంగాళదుంపలను ఫ్రైయింగ్ పాన్ లో వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను చిలకరించి మూత పెట్టాలి.
5. తక్కువ మంట మీద బంగాళదుంపలు 10-15నిముషాల దాకా, ఆవిరిమీదే ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
6. బంగాళదుంప ముక్కలు మెత్తబడ్డాక స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే సింపుల్ మసాలా ఆలూ ఫ్రై రెడీ. దీన్ని సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications