Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మిక్డ్స్ వెజిటబుల్ సేమ్యా ఉప్మా

కావలసిన పదార్ధాలు:
సేమ్యా : 2cups
బీన్స్: 1/2cup
ఆలూ : 1
కారట్: 1
టమాటా: 1
ఉల్లిపాయ : 1
పచ్చిమిర్చి: 6-8
పచ్చిబఠాణీ: 2tbsp
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు: కొద్దిగా
పసుపు : చిటికెడు
ఉప్పు : రుచికి తగినంత
అల్లంవెల్లుల్లి ముద్ద: 1tsp
గరంమసాలా పొడి: 1tsp
నూనె : కావలసినంత
జీడిపప్పు : 8-10
నీళ్ళు : 2cups
పోపుకు: శనగపప్పు,మినప్పప్పు ,ఆవాలు
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక సేమ్యా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో తాలింపు వేసి,జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిబఠాణీ, బీన్స్, ఆలూ, కారట్ ముక్కలు వేసి, కరివేపాకు కూడా చేర్చి కొంచెం వేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.
4. తర్వాత పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి బాగా వేయించి నూనెలో కొద్దిగా ఉడకనివ్వాలి. వెజిటేబుల్స్ అన్ని కొద్దిగా ఉడికినట్లు తెలియగానే నీరు పొయ్యాలి. (నీరు రెండు కప్పుల సేమ్యాకు రెండు కప్పు నీళ్ళు పోసుకోవాలి).
5. ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు వేసి నీళ్ళు మరిగిన తర్వాత వేయించిన సేమ్యా వెయ్యాలి. ఒకసారి కలిపి ఈ గిన్నెను ప్రెషర్ పాన్ లో ఉంచి మూడు విజిల్స్ రానిస్తే సేమ్యా ఉప్మా రెడీ అవుతుంది. కుక్కర్ లో కాకుండా సేమ్యా ఉడికేవరకూ ఉంచి విడిగా కూడా చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications