Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
అత్యంత పౌష్టికాహారం మెలకల కిచిడీ..

కావలసిన పదార్ధాలు :
బియ్యం: 1cup
మెలకెత్తిన గింజలు: 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి : 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
పుదీనా ఆకులు: 10
కొత్తిమీర : కొంచెం
టమాటా: 2
క్యారెట్ తురుము: 1cup
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2tbsp
గరంమసాల పొడి: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
పసుపు : 1/4tsp
నూనె: 3tbsp
నెయ్యి : 2tbsp
పోపుకు: మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి
తయారు చేయు విధానం :
1. ముందుగా బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి. (రెండు రోజుల ముందుగా పెసలు, శనగలు, పల్లీలు, చోలే, అలసందలు వంటివి ఒక రోజంతా నానబెట్టి తర్వాత నీరు వంపేసి కాటన్ బట్టలో ముడికట్టి మెలకొచ్చే వరకూ గట్టిగా కట్టి పెట్టాలి. ఇలా తయారైనవే మెలకలు).
2. తర్వాత ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేడిచేసి అందులో పోపుకు తయారు చేసి పెట్టుకున్న వాటిని వేసి, పోపు వేగాక, కరివేపాకు, ఉల్లిపాయ మిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. మిరియాలు,జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే స్పైసీగా రుచి బావుంటుంది.
3. ఇప్పుడు తరిగిన పుదీనా, కొత్తిమీర, కారట్ తురుము, టమాటా వేసి వేగిన తరువాత పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలపొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి.
3. చివరిగా మొలకెత్తిన గింజలు ,బియ్యం వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఏదైనా రైతా, కుర్మా తో వేడివేడిగా వడ్డిస్తే మొలకల కిచిడీ రుచిగా నోరూరిస్తుంది.



Click it and Unblock the Notifications