ఓట్స్ వెజిటేబుల్ రోటీ:హెల్తీ బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా ముందు ప్లెయిన్ ఓట్స్ పాలల్లో కలుపుకొని తినేవారు. తర్వాత తర్వాత మసాలా ఓట్స్ అంటూ ప్రస్తుతం మార్కెట్టో విరివిగా దొరుకుతున్నాయి. ప్లెయిన్ ఓట్స్ ఇష్టం లేనివాళ్ళు మసాలా ఓట్స్ తింటారు.

ఓట్స్ ను మన ఇండియన్ స్టైల్ వంటకాల్లా తయారు చేస్తే చాలా రుచిగా ఉండటమే కాకుండా మంచి రుచి, ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఓట్స్ తో ఉప్మా, ఓట్స్ పులిహోర వంటితో పాటు ఓట్ రోటీ కూడా వెరైటీగా ఉంటుంది. మరి ఓట్స్ రోటీ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Oats Vegetable Roti For Healthy Breakfast

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 1 cup
వోట్స్: 3/4cup(పొడి చేసుకోవాలి)
చిక్ పీ పిండి: 1/4 cup (శెనగపిండి)
క్యారెట్: 1,(పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1, (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి మిర్చి-అల్లం పేస్ట్: 1tsp
కొత్తిమీర: 3 tbsps(కట్ చేసుకోవాలి)
ధనియాల పొడి: 1 1/4tsp
జీలకర్ర పొడి: 1/2tsp
రెడ్ చిల్లి పౌడర్: 1/4tps
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 1/4 కప్పు
నీరు: తగినంత
ఆయిల్: తగినంత

తయారు చేయు విధానం:
1. ఒక పెద్ద బౌల్లో, పైన చెప్పిన పదార్థాలన్నింటిని మిక్స్ చేసుకోవాలి. (ఆయిల్ మినహాయించాలి). పదార్థాలతో పాటు కొన్ని నీళ్ళుకూడా వేసి పిండిని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పిండిలో నుండి కొద్దికొద్దిగా పిండి తీసుకొనొ పూరీ సైజులో ఒత్తుకోవాలి.
3. తర్వాత పాన్ వేడి చేసి పూరీల వత్తుకొన్న రోటీని పాన్ మీద వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ కాల్చుకోవాలి.
4. తర్వాత రోటీ మీద నెయ్యి లేదా నూనె వేసి మరో రెండు నిముషాలు రెండు వైపులా కాలేలా బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోవాలి.
4. అంతే ఓట్ వెజిటేబుల్ రోటీ రెడీ. దీన్ని పెరుగు మరియు ఊరగాయ లేదా మీకు నచ్చిన కర్రీతో వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

Story first published: Friday, April 19, 2013, 10:13 [IST]
Desktop Bottom Promotion