Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పాలక్-సోయా రైస్

కావలసిన పదార్ధాలు:
సోయా గ్రాన్యూల్స్: 2cups
పాలకూర: మూడు కట్టలు
అన్నం: 2cups
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: ఒక కట్ట
పుదీనా: కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp
గరం మసాలా పొడి: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు-కారం: కావలసినంత
నూనె: సరిపడా
లవంగాలు, చెక్క, షాజీర: కొద్దిగా
తయారు చేసే విధానం:
1. ముందుగా సోయాగ్రాన్యూల్స్ ను మరిగే నీళ్ళలో రెండు నిముషాలు ఉడికించి వడపోయాలి. చల్లని నీళ్ళతో కడిగి నీరు పిండేసి ఉంచుకోవాలి.
2. పాలకూర సన్నగా తరిగి అర స్పూన్ నూనె వేసి ఉడికించి పెట్టుకోవాలి.
3. నూనె వేడి చేసి రెండు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, షాజీర వేయాలి.
4. సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి సోయాగ్రాన్యూల్స్ వేయాలి.
5. తడి అంతా పోయి డ్రై గా వేయించాలి. ఉడికించిన పాలకూర వేసి బాగా కలిపి పసుపు, కారం, గరం మసాలా పొడి వేయాలి.
6. చివరగా అన్నం, తగినంత ఉప్పు, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి. అంతే పాలక్ సోయా రైస్ రెడీ.



Click it and Unblock the Notifications