Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఢిఫరెంట్ స్టైల్ ఉప్మా- పాలక్ ఉప్మా

కావలసిన పదార్థాలు:
బొంబాయిరవ్వ: 1cup
నీళ్ళు: 2cups
పాలకూర: రెండు కట్టలు(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 2tbsp
నెయ్యి: 2tbsp
పుట్నాలపొడి(పచ్చిశెనగపప్పు): 2tbsp
టమాటగుజ్జు: 2tbsp
వేరు శనగగింజలు: 1/2cup
ఎండుమిర్చి: 2
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 3
అల్లం: చిన్నముక్క(తురమాలి)
మినపప్పు: 1tsp
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మరసం: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడిచేసి వేరుశనగగింజలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ అతి తక్కువ మంట మీద వేయించి తీసి విడిగా ఉంచాలి.
2. తరువాత అదే నూనెలో మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
3. తరువాత అందులోనే పాలకూర తరుగు కూడా వేసి కొద్దిగా మగ్గనిచ్చి టమాటాగుజ్జు, పుట్నాలపొడి, సరిపడా ఉప్పు వేసి రెండు కప్పుల నీళ్లు పోయాలి.
4. ఇప్పుడు నీళ్లు మరిగే సమయంలో రవ్వను పోసి వేరుశనగగింజలు వేసి బాగా కలుపుతూ మంట తగ్గించాలి. రవ్వ మగ్గిన తరువాత పాన్ పక్కకు దింపుకొని నిమ్మ రసం చిలకరించి కలిపి మూతపెట్టాలి.
5. అంతే పాలక్ ఉప్మా రెడీ..దీన్ని పప్పు పొడి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఏదైనా ఈ ఉప్మాతో తింటే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications