పనీర్‌ బటర్‌ మసాలా

Paneer and Butter Masala
కావలసిన పదార్ధాలు:
పనీర్‌: 250grms
ఉల్లిపాయలు: 2
టొమాటో పేస్ట్: 3tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీడిపప్పు పేస్ట్: 2tbsp
కారం: 1tsp
ధనియా: 1tsp
గరం మసాలా: 1tsp
పుదీనా ఆకులు: 10
క్రీమ్: 1cup
పచ్చిమిర్చి: 4
యాలకులు: 2
లవంగాలు: 3
వెన్న: 2 tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానము:
1. పాన్‌లో వెన్న వేసి వేడిచేయాలి.
2. తర్వాత పనీర్‌ముక్కల్ని ఎర్రగా వేయించి తీయాలి. అదే పాన్‌లో యాలకులు, లవంగాలు వేసి లైట్ గా వేయించాలి.
3. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బంగారు వర్ణంలోకి మారిన తర్వాత వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసి వేయించాలి.
4. తర్వత టొమాటో ముక్కలు వేసి 15 నిమిషాలు వేయించాలి.
5. వేగిన తరువాత స్టవ్‌ మీద పెట్టి రుబ్బిన గరం మసాలా, ధనియా, కారం, వేసి ఉప్పు సరిచూసి పనీర్‌ ముక్కలు వేసి తక్కువ మంటమీద 15 నిమి షాలు ఉడికించి దించే ముందు క్రీమ్ కలిపి ఒక్కనిమిషం వుంచి దింపేయాలి. దించేముం దు కొత్తిమీర చల్లితే సరి పనీర్ బటర్ రెడీ.

Story first published: Tuesday, July 6, 2010, 15:38 [IST]
Desktop Bottom Promotion