Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పనీర్ హరియాలి: టేస్టీ అండ్ ఈజీ
పనీర్ తో తయారు చేసే వంటలు ఎల్లప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. పనీర్ తో తయారచేసే ప్రతి వంట, వేటికవే ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. పనీర్ ను వివిధ రకాలుగా వండుతారు.
పనీర్ హారియాలి, చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేయవచ్చు . ఈ వెజిటేరియన్ రిసిపిని ,తాజా కొత్తిమీర మరియు పుదీనాతో కాంబినేషన్ తో తయారుచేస్తారు. ఈ మూడింటి కాంభినేషన్ నిజంగా ఒక ఫ్లేవర్ ఫుల్ కాంభినేషన్. మరియు ఇది ఆకుపచ్చని కలర్ ను అంధిస్తుంది.

పనీర్: 250gms
తాజా కొత్తిమీర: చిన్న కట్ట(ఆకులు విడిపించి పెట్టుకోవాలి)
తాజా పుదీనా ఆకులు: ½ కట్ట(ఆకులు విడిపించి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2
వెల్లుల్లి రెబ్బలు: 4
కాప్సికమ్: 1 (ముక్కలుగా కట్ చేయాలి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఛాట్ మసాలా: 1tsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tbsp
నీళ్ళు: 1cup
తయారు చేయు విధానం:
1. కొత్తిమీర మరియు పుదీనాను ఆకులుగా విడిపించి, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో కొత్తిమీర, పొదినా, అల్లం, వెల్లుల్లి, అరకప్పు నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
4. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ మరియు టమోటో ముక్కలు వేసి మరో 3-4నిముషాలు వేగించుకవోాలి
5. తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న కొత్తిమీరపుదీన పేస్ట్ కూడా వేసి మీడియం మంట మీద మరో 5నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో పసుపు, ఛాట్ మసాల, ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో పన్నీర్ క్యూబ్స్ కూడా వేసి అరకప్పు నీళ్ళు పోసి, మూత పెట్టి, 5నిముషాలు ఉడికించుకోవాలి.
8. పనీర్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి . అంతే పన్నీర్ హరియాలీ రెడీ టు సర్వ్ . ఇది జీరా రైస్ మరియు రోటీలకు చాలా అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications