Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పీస్-పనీర్ కర్రీ రిసిపి-డయాబెటిక్ స్పెషల్
మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వ్యాధి. ఈ వ్యాధితో పోరాడాలంటే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు, రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ డయాబెటిక్ పేషంట్స్ కొరకు ఇక్కడ ఒక రుచికరమైన వంట పరిచయం చేయబడింది.
డయాబెటిక్ వెజిటేరియన్ రిసిపి పీస్ మరియు పనీర్ కాంబినేషన్ రిసిపి చాలా ఫేమస్. ఎందుకంటే పనీర్ చాలా సాఫ్ట్ గా ఉండి, చాలా తేలికగా త్వరగా జీర్ణం అవుతుంది. మరియు ఆరోగ్యకరం. మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు. మరి ఈ డయాబెటిక్ స్పెషల్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పనీర్: 100grms
వెల్లుల్లి: 5
లవంగాలు: 2
అల్లం: కొద్దిగా (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2(మద్యలోకి కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర: 2tbsp
పసుపు: 1tbps
గరం మసాలా: 1tbsp
టమోటో: 4(సన్నగా కట్ చేసుకోవాలి)
పీస్(పచ్చిబఠానీ):1cup
ఆకుకూర: 2cup(సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: 1
నూనె: 3
ఉప్పు: రుచికిసరిపడా
తయారుచేయు విధానం :
1. స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడిచేయాలి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి మరో నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, మరియు గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పదార్థాలన్ని మీడియం మంట మీద 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి బాగా వేగించాలి. టమోటో మెత్తగా అయ్యే వరకూ ఫ్రై చేయాలి.
5. 5 నిముషాల తర్వాత అందులో పచ్చిబఠానీలను కూడా వేసి 5నిముషాలు ఫ్రై చేసి, మంట మీడియంగా పెట్టి పాన్ మీద మూత పెట్టాలి.
6. ఇప్పుడు అందులో తరిగి పెట్టుకొన్న ఆకుకూర కూడా వేసి, నిధానంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
7. మంటను పూర్తిగా తగ్గించి పచ్చిబఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తమీర, పనీర్ ముక్కలు కూడా వేసి, నిధానంగా కలుపుకోవాలి. మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే పీస్ పనీర్ కర్రీ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications