Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పెసరట్టు దోస రిసిపి:ఆంధ్రా స్టైల్ ట్రేడిషనల్ బ్రేక్ ఫాస్ట్
మీరు ఈ రోజు ఉదయం ఒక ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తినాలనుకుంటున్నారా,మరి అయితే మీకోసం ఒక అద్భుతమైన రుచిగల బ్రేక్ ఫాస్ట్ రిసిపిని అందిస్తున్నాం. పెసరట్టు మీకు బాగా తెలుసు. ఆంధ్రస్టైల్ పెసరట్టు అంటే అందరికీ చాలా ఇష్టం.
వేడి వేడి పెసరట్టును కొంచెం స్టైల్ మార్చి దోసెలా తయారుచేస్తే ఎలా ఉంటుందో, ఈ పెసరట్టు దోస తెలుపుతుంది. అందుకు ముడిపెసళ్ళుతో పాటు, పచ్చిబియ్యం కూడా కొద్దిగా నానబెట్టి, తయారుచేసే ఈ పెసరట్టుదోసె కొబ్బరి చట్నీతో మీ టేస్ట్ బడ్స్ కు అద్భుతమైన రుచి అంధిస్తుంది. మరి మీరు కూడా ఈ ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతి తెలుసుకోవాలిగా మరి....

కావల్సిన పదార్థాలు:
ముడిపెసుళ్ళు: 2cups
పచ్చిబియ్యం: 3tsp
ఉల్లిపాయ : 1(సన్నగా తరిగినవి)
అల్లం చిన్న ముక్క: 1
జీలకర్ర: 2tsp
పచ్చిమిర్చి: 5(ముక్కలుగా కట్ చేయాలి)
ఉప్పు: రుచికి సరిపడా
టాపింగ్ కోసం:
ఉల్లిపాయ: 1(సన్నగా, చిన్నగా తరిగి పెట్టుకోవాలి)
తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరట్టు దోస తయారుచేయడానికి, ముందుగా మీరు ముడిపెసళ్ళుమరియు పచ్చిబియ్యం రెండిటింని ఒకే గిన్నెలో వేసి, శుభ్రంగా కడిగి 6గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.6గంటల తర్వాత ఈ నానెబెట్టుకొన్న పెసళ్ళ, బియ్యం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం సగం గ్రైండ్ చేసుకొన్నాక మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మరియు ఉప్పుకూడా అందులో వేయాలి.
3. ఇప్పుడు ఈ పూర్తి మిశ్రమానికి జీలకర్ర కూడావేసి మిక్స్ చేయాలి.
4. ఈ మొత్తం మిశ్రమం గ్రైండ్ చేసుకొన్న తర్వాత, పాన్ స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద వేడి చేయాలి.
5. పాన్ వేడయ్యాక, గ్రైండ్ చేసి పెట్టుకొన్న పిండి మిశ్రమాన్ని ఒక పూర్తి గెరిటి పాన్ మీద దోసెలా పోసి, పాన్ మొత్తం సర్దాలి.
6. ఈ పిండి మొత్తం దోసెలా పరచిన తర్వాత దోసె కాలేటప్పుడు , మంటను మీడియంగా పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనెను, పెసరట్టు దోసెమీద చిలకరించాలి.
7. దోసె ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత, దోసె మద్యభాగంలో ఉల్లిపాయ ముక్కలను కూడా చిలకరించాలి.
8.దోసె కాడతో ఉల్లిపాయ ముక్కలను దోసెలోపలి లైట్ గా ప్రెస్ చేయాలి.
9. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు దోసె ఒక వైపు కాలిన తర్వాత, దోసెను రెండవవైపు టర్న్ చేసి కాల్చుకోవాలి.
10. మీడియం మంట మీద దోసె లైట్ గా కాలిన తర్వాత, పాన్ నుండి తీసి సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే తినడానికి పెసరట్టు దోస, ఆంధ్రా స్టైల్ రిసిపి రెడీ. ఈ దోసెకు కొబ్బరి చట్నీఒక మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications