Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పూరీ సాగు బహుల రుచి గల బ్రేక్ ఫాస్ట్

గోధుమ పిండి లేదా మైదా: 2cups
నూనె: 2tsp
నీళ్ళు : తగినంత
ఉప్పు: రుచికి తగినంత
పూరీ వేయించుకోవడానికి నూనె: కావలసినంత
పూరీ తయారు చేయు విధానం:
1. ఉప్పు, నూనే, నీళ్ళు, పూరీ పిండిలో కలిపి చపాతిపిండిలా మృధువుగా కలుపుకోవాలి.
2. ఒక గంట తరువాత పూరీలను గుండ్రంగా వత్తుకొని కాగిన నూనేలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాలిన తర్వత పక్కకు తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అందుకు ముందుగానే పూరి సాగు రెడీ చేసుకోవాలి. సాగు తయారు చేయడం ఎలాగంటే...
సాగు కావలసిన పదార్థాలు:
మిక్డ్స్ వెజిటేబుల్స్: 2cups(బీన్స్, క్యారెట్, బంగాళదుంప, బఠానీ)
ఉల్లిపాయ: 1( కట్ చేసినవి)
టమోటో: 1 ( కట్ చేసినవి)
ఆవాలు: 1/2tsp
నూనె : 2tbsp
కొత్తిమీర తరుగు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మసాలాకు కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 1/2cuూ
చిన్న ఉల్లిపాయలు: కొద్దిగా
జీలకర్ర: 1tsp
ధనియాలు: 2tsp
గసగసాలు: 1tsp
శెనగపప్పు(పుట్నాలు): 1tsp ( వేయించిన పుట్నాలు)
పచ్చిమిర్చి : 5-6
చింత పులుసు: 1tsp
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
పసుపు: 1/4tsp
కొత్తిమీర తరుగు: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మసాలాకు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో ఆవాలు, వేసి అవి చిటపట అన్న తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
3. తర్వాత అందులో టోమాటో ముక్కలు కూడా వేసి అది కాస్త వుడికినతరువాత తరిగివుంచిన కూరగాయలన్నీ అందులోవేసి 5-10నిమిషాల పాటు వుడికించుకోవాలి.
4. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాల ముద్దను ఉడుకుతున్న కూరగాయలలో వేసి, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు పోసి మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే వేడి, వేడిగా పూరీ సాగుతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications