Latest Updates
-
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం!
పుదీనా రైస్

పుదీనా : 2 కట్టలు
బాస్మతి బియ్యం : 2cups
పచ్చి కొబ్బరి తురుము: 1/2cup
పచ్చిమిర్చి: 3
ఉల్లిపాయ: 2 (సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి: 1tsp
లవంగాలు: 4
యాలకులు: 4
దాల్చిన చెక్క: 4
పలావు ఆకులు: 4
అనాసపువ్వు : 1
వేయించిన జీడిపప్పు: 1/2cup
నెయ్యి : 2 tsp
ఉప్పు : రుచికి సరిపడినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పుదీనా ఆకులను తుంచుకొని బాగా కడగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టు కోవాలి.
2. ఇప్పుడు పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పును మిక్సీ లో వేసి మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద ఓ మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడయ్యాక మసాలా దినుసులు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయిం చుకోవాలి. 4. ఇవి వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్టును వేసి రంగు మారే వరకూ వేయించుకోవాలి. ఈ విశ్రమం ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారేంత వరకూ చిన్న కలియబెడుతూ ఉండాలి.
5. తర్వాత నానబెట్టకున్న బియ్యం, నీళ్లతో సహా వేసి గరిటెతో బాగా కలపి ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అన్నం బాగా పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి. దీనికి సైడ్ డిష్ గా గ్రేవీగా చేసుకున్న ఏదైనా మసాల కర్రీని కానీ... లేదా పెరుగు చట్నీని కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications