Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
గుమ్మడి సాంబార్: ఉగాది స్పెషల్ రిసిపి
తీపి గుమ్మడికాయ సాంబార్ ఒక ట్రెడిషనల్ రిసిపి. ముఖ్యంగా ఇది సౌత్ ఇండియన్ స్పెషల్ రిసిపి. దీన్ని తెల్లగుమ్మడి ముక్కుల మరియు కంది పప్పుతో తయారుచేస్తారు. రుచికరంగా ఉంటుంది. రుచికరమైన గుమ్మడి సాంబార్ రైస్ , ఇండ్లీ, సాంబార్, వడ వంటివాటికి ఒక కామన్ డిష్.
దీన్ని చాలా సులభంగా మరియు తర్వాగ తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ఫెస్టివల్ సీజన్ లో గుమ్మడి సాంబార్ రుచి చూడాలంటే ఎలా తయారుచేయాలో చూడండి...

కావలసిన పదార్థాలు:
తీపిగుమ్మడికాయ ముక్కలు: 1cup
కందిపప్పు: 1cup
ఉల్లిపాయలు: 3
చింతపండు: నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి)
పచ్చిమిర్చి: 6
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
కారం: 1/2tsp
బియ్యప్పిండి: 1tsp
మెంతులు: 5-6సీడ్స్
ఆవాలు: 1/2tsp
నూనె: 2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా పప్పును మరియు టమోటోను ప్రెజర్ కుక్కర్ లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ మెత్తగా ఉడికించుకోవాలి.
2. ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, మెంతులు, నీరు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
3. తర్వాత పసుపు, కారం, చింతపండు రసం, రెండు కప్పుల నీరు జత చేసి, బాగా కలపాలి.
4. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న పప్పును వేసి బాగా కలిపి, ఉడుకుతున్న సాంబార్‌లో వేసి పదినిముషాలు ఉంచాలి.
5. తర్వాత స్టౌ మీద మరో డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి, సాంబార్‌లో వేయాలి.
6. చివరగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చి దించేయాలి. అంతే గుమ్మడికాయ సాంబార్ రెడీ. ఇది ఒక టేస్టీ ట్రెడిషనల్ రిసిపి



Click it and Unblock the Notifications