Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పంజాబీ దాల్ తడ్కా: స్పెషల్ రిసిపి
మీరు చాలా రెస్టారెంట్స్ లో దాల్ తడ్కా పంజాబీ రిసిపిని తప్పకుండా రుచి చూసి ఉంటారు. పంజాబీయులకు ఇది అత్యంత ఇష్టమైన వంట. మరియు ఈ వంటను నార్త్ ఇండియన్స్ రెగ్యులర్ గా వండుకుంటారు. పక్కా పంజాబీ స్టైల్ దాల్ తడ్కా హైవేస్, రోడ్ సైడ్ డాబాల్లో మీరు చూసుంటారు. ఈ స్పైసీ పంజాబీ దాల్ తడ్కా చాలా అద్భుత రుచి కలిగి ఉంటుంది.
పంజాబీ దాల్ తడ్కా , ఇతర దాల్ తడ్కా కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది . ఇది కొన్ని మసాలా దినుసులతో తయారుచేస్తారు . చాలా సింపుల్ గా మరియు త్వరగా, అదే విధంగా టేస్టీ గా ఉండే ఈ పంజాబీ దాల్ తడ్కాను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 1/2cup
టమోటాలు :2 (తరిగినవి)
అల్లం: ½ అంగుళాల (ముక్కలుగా చేసి)
ఉల్లిపాయ: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు: ఒక చిటికెడు
పచ్చిమిర్చి :2 (సన్నగాతరిగినవి)
ఎండుమిర్చి: 2
ఇంగువ: ఒక చిటికెడు
బిర్యానీ ఆకు: 1
జీలకర్ర : 1tsp
ఆవాలు :1tsp
నెయ్యి: 3tbsp
నూనె :1tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడిచేయాలి. వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
2. తర్వాత 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకొన్న తర్వాత, అల్లం తురుము వేయాలి.
3. ఒక నిముషం వేగిన తర్వాత టమోటో ముక్కలను వేయాలి.
4. కొద్దిగా ఉప్పు చిలకరించి టమోటో ముక్కలను 5 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు శుభ్రం చేసి కడిగి నానబెట్టుకొన్న పప్పును ప్రెజర్ కుక్కర్ లో వేయాలి.
6. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, అందులో పసుపు మరియు 3కప్పుల నీళ్ళు పోసి, మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో చిటికెడు ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి మరియు బిర్యానీ ఆకు వేసి 3నిముషాలు వేగనివ్వాలి.
8. తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేంగించి, తర్వాత కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి . చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే పంజాబి దాల్ తడ్కా రెడీ . దీన్ని పరోటాలతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications