బీట్ రూట్-కోకోనట్ ఫ్రై: స్పెషల్ సైడ్ డిష్

రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. శక్తినిచ్చే శాకాహారదుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం.. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీట్‌ రూట్‌ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

బీట్ రూట్ తో వివిధ రాకాల వంటలు వండుతారు. ముఖ్యంగా బీట్ రూట్ తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్ రూట్ కర్రీ, వేపుడు వంటివి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రంగు రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరంగాను బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లో అత్యధిక పోషవిలువలు ఉన్నాయి. ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధవున్నవారు రెండుబీట్ రూట్ తినడానికి ఇష్టపడుతారు. అయితే బీట్ రూట్ తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి బీట్ రూట్ ను, జ్యూసులు, సలాడ్, వేపుడు రూపంలోనే కాకుండా బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు. పూరీలు మొదలు వడలు వరకూ వివిధ రకాల వంటలు తయారు చేసుకొని తినవచ్చు. మరి బీట్ రూట్ వెరైటీగా కొబ్బరి తురుము చేర్చి, ఒక సైడ్ డిష్ ను తయారుచేద్దాం...

Quick Beetroot and Coconut Fry

కావల్సిన పదార్థాలు
బీట్ రూట్: 3(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొబ్బరి తురుము: 1/4cup
ఉల్లిపాయ: 2(సన్నగా, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఎండుమిర్చి : 2(మద్యలోకి కట్ చేసుకోవాలి)
కారం: 1/2tsp
ఆవాలు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బీట్ రూట్ పై పొట్టు తొలగించి శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత కుక్కర్ లో బీట్ రూట్ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి, 2విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్ లో ఆవిరి పూర్తిగా తగ్గిపోయే వరకూ ఉండాలి.
4. ఆవిరి పూర్తిగా తగ్గిని తర్వాత, కుక్కర్ మూత తీసి, నీరు వంపేసి, బీట్ రూట్ ముక్కలను పక్కన తీసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి, వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 3నిముషాలు వేయించుకోవాలి.
6. తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా వేసి ఒక నిముషం వేగిన తర్వాత, అందులో బీట్ రూట్ ముక్కలు వేసి 5నిముషాలు మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.
7. చివరగా కొబ్బరి తురము వేసి మిక్స్ చేస్తూ, వేయించుకోవాలి. అంతే బీట్ రూట్ కోకోనట్ ఫ్రై రెడీ. ఇది సైడ్ డిష్ గా చాలా రుచికరంగా ఉంటుంది.

Story first published: Thursday, January 30, 2014, 11:56 [IST]
Desktop Bottom Promotion