Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పండుమిర్చి టొమాటో నిల్వ పచ్చడి-కొత్త రుచి
టమోటా అంటే ఇష్టం లేదని ఎవ్వరంటారు. ఎర్రగా దోరగా నిగనిగలాడుతూ చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కొందరు వండేదాక ఆగడమా అంటూ అలాగే తినేస్తారు. దీనితో చేయని వంటకం లేదు. కూర, చారు, పప్పు, పచ్చడి , జామ్, జ్యూసు, కెచప్, సాస్-ధరకూడా అందుబాటులోనే ఉంటుంది. మరీ టమోటో ఊరగాయతో కొంచెం వెరైటీ టేస్ట్ రుచి చూద్దాం. టమోటోను తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం.. టమోటాల్లో క్యాల్షియం, పాస్పరస్, విటమీన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్త్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాలో సిట్రిక్ ఆమ్లం ఉండడంతో ఎసిడిటీ దూరమౌతుంది.
టమోటాల్లో విటమిన్ ఎ అధికంగా ఉండడంతో కంటి జబ్బులు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. రోగ నిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమన్ ఏ, విటమిన్ సి రోగ నిరోధక శక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న టమోటోతో నిల్వ పచ్చడి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసినవి:
ఆవాలు - 2tbsp
వైట్ వెనిగర్ - 11/2cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ - tbsp
ఆలివ్ ఆయిల్ - 11/2cup
పండుమిర్చి - 1/2kg (గింజలు తీసేయాలి)
టొమాటోలు - 2kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు - tsp
జీలకర్ర - 4tsp
పంచదార - cup
ఉప్పు - రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ఒక పాత్రలో ఆవాలు, వైట్ వెనిగర్ వేసి సుమారు అరగంటసేపు నాననివ్వాలి .
2. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి.
3. పసుపు, జీలకర్ర, పంచదార, ఉప్పు, వెనిగర్‌లో నానబెట్టిన ఆవాలు జతచేయాలి
4. మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి
5. చల్లారాక గాలిచొరని జాడీలోకి తీసుకుని సుమారు 10 రోజుల తరువాత ఉపయోగించుకోవాలి. అంతే రెడ్ చీల్లీ టమోటో పచ్చడీ రెడీ...



Click it and Unblock the Notifications