Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ట్రెడిషినల్ బ్రేక్ ఫాస్ట్ -బియ్యం రవ్వ ఉప్మా

కావల్సిన పదార్థాలు:
బియ్యం రవ్వ : 2 cups
పెసరపప్పు: 1/4 cup
నీళ్ళు: 4 1/2 cups
పచ్చిమిర్చి: 3 - 4
ఉప్పు: రుచికి సరిపడా=
పోపుకోసం:
నూనె: 4 tsp
ఆవాలు: 1/4 tsp
ఉద్దిపప్పు: 1/4 tsp
పచ్చిశెనగపప్పు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి రెండు మూడు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని వంపేసి పొడి కాటన్ వస్త్రం మీ బియ్యాన్ని ఆరబెట్టాలి. బియ్యం ఆరిన తర్వాత మిక్సీలో వేసి రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి, చిటపటలాడిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉద్దిపప్పు, శెనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
3. పోపు దినుసులు వేగిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి, ఉప్పు కూడా వేసి ఎసరును బాగా మరగనివ్వాలి.
4. నీరు బాగా మరిగే సమయంలో ఉప్పు సరిచూసుకొని బియ్యం రవ్వను, పెసరపప్పును, వేసి గరిటతో కలియబెడుతూ ఉడికించుకోవాలి. లేదంటే ఉండలు కడుతుంది. కొద్దిసేపటి తర్వాత మంట తగ్గించి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే బియ్యం రవ్వ ఉప్మా రెడీ. దీన్ని నిమ్మ లేదా పప్పుల పొడి లేదా ఏదైనా ఊరగాయతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే బియ్యం రవ్వ ఉప్మా రెడీ.



Click it and Unblock the Notifications