Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కాలీఫ్లవర్ రోస్ట్ : వెజిటేరియన్ డిలైట్
కాలీఫ్లవర్ ఫ్రై లేదా రోస్ట్ ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చాలా అద్భుతమైన రుచికలిగినటువంటి వెజిటేరియన్ రిసిపి. దీన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు.
ఈ కాలీఫ్లవర్ రోస్ట్ కు కొన్ని వండర్ ఫుల్ మాసాలా దినుసులతో మ్యారినేట్ చేసి తర్వాత బేక్ చేస్తారు. ఆరోమా వాసనతో రుచికరంగా, బ్రౌన్ గా ఉండే కాలీఫ్లవర్ రిసిపి మీరు కూడా టేస్ట్ చేయాలంటే తయారుచేసే పద్దతిని వాటికి కావల్సిన పదార్థాలను క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి...

కావల్సిన పదార్థాలు:
నెయ్యి- 2-3tbsp
కాలీఫ్లవర్-1 (మీడియంగాపువ్వులను విడిపించి పెట్టుకోవాలి)
పెరుగు-1cup
గ్రీన్ మిరప పేస్ట్: 1tbsp
అల్లం పేస్ట్: 1tbsp
జీలకర్ర పౌడర్: 1tbsp
గరం మసాలా ½tbsp
పసుపు: 1tbsp
కూరగాయల నూనె: 1tbsp
పంచదార: 1tsp
ఉల్లిపాయలు: 1cup
ఉప్పు: రుచికి సపరిపడా
కొత్తిమీర: 1cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
తయారుచేయు విధానం:
1. ముందుగా పెద్ద క్యాసరోల్ డిష్ తీసుకొని, దానికి నెయ్యి రాయాలి.
2. తర్వాత ఓవెన్ ను 450డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి.
3. ఇప్పుడు కాలీఫ్లవర్ శుభ్రంగా కడిగి ఒక పెద్ద బౌల్లోనికి తీసుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లంపేస్ట్, , జీలకర్రపొడి, గరం మసాలా, పసుపు, పంచదార, వెజిటేబుల్ ఆయిల్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని అరగంట పాటు అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
4. అరగంట తర్వాత నూనె రాసిన కాసిరాల్ పాన్ లో మ్యారినేట్ చేసుకొన్న కాలీఫ్లవర్ వేసి ఒవెన్ లో పెట్టి 20-25నిముషాలు బేక్ చేయాలి. బ్రౌన్ కలర్ కు మారగానే ఓవెన్ స్టాప్ చేయాలి.
5. అంతే కాలీఫవర్ రోస్ట్ రెడీ. ఒవెన్ లేకపోతే, అలాగే ఫ్రై చేసుకోవచ్చు.
6. ఇప్పుడు రోస్ట్ చేసిన కాలీఫ్లవర్ ను నాలుగు ప్లేట్స్ లో సర్వ్ చేయాలి.
7. కాలీఫ్లవర్ రోస్ట్ తో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మరియు కొత్తిమీర తరుగుతో గార్నిషం్ చేసి వేడి వేడిగా సర్వ్ చేాయలి.



Click it and Unblock the Notifications