Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సింపుల్ అండ్ ఈజీ మష్రూమ్ కర్రీ
వెజిటేరియన్ వంటల్లో ఒక రుచికరమైన వెజిటేరియన్ రిసిపి మష్రుమ్ కర్రీ. మష్రుమ్ కర్రీని వివిధ రకాలుగా తయారుచేయవచ్చు. అలాగే వివిధ రకాల వంటలకు వివిధ రకాలైన మష్రుమ్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి .
మష్రుమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మష్రుమ్ లో పొటాషియం మరియు ఇతర ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మన ఇండియన్ కుషన్స్ లో, చాలా వరకూ వెజిటేరియన్ మష్రుమ్ డిష్ లలో మష్రుమ్ కర్రీ, మష్రుమ్ పనీర్, ఫ్రైడ్ మష్రుమ్, మష్రుమ్ చిల్లీ వంటి డిష్ లు చాలా పాపులర్ అయినటువంటివి. మరి మష్రుమ్ తో ఒక సింపుల్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసినపదార్థాలు:
మష్రూమ్స్ : 2cup
చింతపండు : కొద్దిగా (నీళ్లలో నానబెట్టాలి)
ఉప్పు : రుచికి తగినంత
గరంమసాలా : 1tsp
శనగపప్పు : 1tbsp
మిరియాల పొడి : 1tsp
నూనె : 2tsp
ఆవాలు : 1/2tsp
ఎండుమిర్చి : 2
కొత్తిమీర : కొద్దిగా
టొమాటో ముక్కలు :1/2 cup
కరివేపాకు : 2 రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి
3. పాన్‌లో నూనె వేసి కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక టొమాటో ముక్కలు వేయించాలి.
4. టమోటో ముక్కలు మెత్తబడ్డాక అందులో మష్రూమ్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి.
5. చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మష్రుమ్ కర్రీ రెడీ .



Click it and Unblock the Notifications