Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్నాక్ రిసిపి: స్పైసీ బెండీ ఫ్రై
ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ బోరుకొట్టవచ్చు. కాస్త వెరైటీగా కొన్ని స్పైసీ స్నాక్స్ తీసుకోవడం టేస్ట్ బడ్స్ ను సాటిస్ఫై చేయెచ్చు . మరి అలాంటి స్నాక్ రిసిపి ఒకటి మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము.
కరకరలాడే బేండీ ఫ్రై . ఈజీ స్నాక్ రిసిపి. చాలా రుచికరమైన స్నాక్ రిసిపి . దీన్నీ ఈవెనింగ్ సమయంలో తీసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సింపుల్ మరియు ఈ స్నాక్ రిసిపి టేస్టీ మాత్రమే కాదు, తయారుచేయడం కూడా సులభమే , ఇంకా హెల్తీ కూడా మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
బెండకాయలు- 10 to 15
ఉల్లిపాయలు - 1/2 cup
క్యాప్సికమ్- 1/2 cup
కారం - 1 teaspoon
గరం మసాలా - 1/2 teaspoon
కార్న్ ఫ్లోర్ - 1/2 teaspoon
ధనియాలపొడి - 1/4th teaspoon
బియ్యం పిండి- 1/4th teaspoon
కొత్తిమీర(సన్నగా తరిగిపెట్టుకోవాలి) - 1/4th teaspoon
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక్కొక్క బెండకాయను నిలువుగా నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బెండకాయలను నాలుగు బాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఇలా కట్ చేసుకొన్న బెండకాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో గరం మసాలా, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ధనియాలపొడి, కారం, ఉల్లిపాయ ముక్కలు మరియు క్యాప్సికమ్, ఉప్పు వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి
3. వీటిని మిక్స్ చేయడానికి వాటర్ ను కలపకండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి, నూనె వేడి అయ్యాక అందులో బెండకాయ మిశ్రమాన్ని వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. అంతే వేడి వేడి స్పైసీ అండ్ హాట్ బెండీ ఫ్రైని సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications