Latest Updates
-
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా?
స్పెషల్ జొన్న రొట్టే మరియు బ్రింజాల్ కర్రీ
సాధారణంగా మనం ప్రతి రోజూ పరాటో, చపాతీ, లేదా రోటి వంటివి ఎక్కువగా తయారుచేసుకుంటుంటాము. వీటి తయారీకి గోధుమ పిండి లేదా మైదనాను ఎంపిక చేసుకుంటాము. అయితే ఇలా రోజూ చేసిన వంటలలో మీకు బోరుగా అనిపిస్తుంటే.....మీకోసం ఒక వెరైటీ స్పెషల్ వంటను, రుచికరమైన వంటను పరిచయం చేస్తున్నాము.
ఈ స్పెషల్ డిష్ ఏంటంటే జొన్న రొట్టె మరియు వంకాయ గ్రేవీ . ముఖ్యంగా ఇది నార్త్ కర్ణాటకాలో చాలా ఫేమస్ డిష్ . జొన్న రొట్టె మరియు బ్రింజాల్ కర్రీ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ వంటలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రెగ్యులర్ గా జొన్న రొట్టె తినడం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో, శరీర ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
జొన్నల్లో మినిరల్స్ , ఐరన్, మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటాయి . ఇది అనీమీయా తగ్గిస్తుంది. మరియు శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

జొన్న రొట్టెకు కావల్సిన పదార్థాలు:
జొన్నపిండి: 4cup
ఉప్పు: కొద్దిగా
వేడి నీళ్ళు పిండికలుపుకోవడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా జొన్నపిండిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి.
2. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి.
3. తర్వాత వేడినీళ్ళు పోసుకొని మెత్తగా సాప్ట్ గా కలుపుకోవాలి. ఎక్కువ నీరు తీయకుండా కలుపుకోవాలి .
4. తర్వాత ఈ పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకుంటే ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత రోలింగ్ స్టిక్ తీసుకొని , ఒక్కొ ఉండను చపాతీల రోల్ చేసుకోవాలి. లేదా చేత్తోనే అరచేతిలో పెట్టి ఒత్తుకోవచ్చు .
6. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి వేడి అయ్యాక ఇలా చపాతీల ఒత్తిపెట్టుకొన్న జొన్న రొట్టెను వేసి మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మొత్తం రొట్టెలను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.

బ్రింజాల్ గ్రేవీకి కావల్సిన పదార్థాలు:
వంకాయలు - 6 (blue coloured)
వేరుశెనగలు - 1 cup
పచ్చిశెనగపప్పు - 1/2 cup
కొబ్బరితురుము - 1/2 cup
బెల్లం - 2 teaspoons
చింతపండుపేస్ట్ - 1 teaspoon
జీలకర్ర - 1/2 teaspoon
ఆవాలు - 1/2 teaspoon
ఎండుమిర్చి - 5 to 6
ఉల్లిపాయలు - 1 cup
టమోటోలు - 1 cup
కొత్తిమీర - 1/2 cup
పసుపు - 1/4th teaspoon
నూనె: తగినంత
ఉప్పు రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీలో, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, టమోటో, వేరుశెనగలు, పచ్చిశెనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర, చింతపులుసు,బెల్లం, మరియు ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత వంకాయలను శుభ్రం చేసి, ఒక్కో వంకాయను నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి.(గుత్తివంకాయకు కట్ చేసినట్లు కట్ చేసుకోవాలి)
3. తర్వాత ఒక్కో వంకాయను తీసుకొని ముందుగా తయారుచేసుకొన్న మసాలాను వంకాయల్లో స్టఫ్ చేయాలి. ఇలా అన్ని వంకాయలను స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాకు అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, టమోటో ముక్కలు, కారం వేసి మొత్తగా ఫ్రై చేసుకోవాలి.
5. ఉల్లి, టమోటో ముక్కలు మెత్తబడ్డాక అందులో మసాల స్టఫ్ చేసిన వంకాలను నిధానంగా పోపులో వేసి మొక్స్ చేసి కలియబెడుతూ 10 నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి .
6. తర్వాత అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కొద్దిగా మిక్స్ చేసి, వంకాను మెత్తగా ఉడికించుకోవాలి. అంతే బ్రింజాల్ కర్రీ రెడీ. ఈ రుచికరమైన నోరూరించే బ్రింజాల్ కర్రీని జొన్నరొట్టెతో సర్వ్ చేస్తే సూపర్ గా ఉంటుంది



Click it and Unblock the Notifications