Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్పైసీ ఆచారి పన్నీర్ పులావ్
ఆచార్ పన్నీర్ కలర్ ఫుల్ గా, టేస్టీగా ఉండే ఆచార్ పన్నీర్ ఆరోగ్యానికి మంచిది మరియు ఇందులో అధిక ప్రోటీనులను కలిగి ఉంటుంది. ఆచార్ పన్నీర్ తయారు చేయడానికి మనం సాధారణంగా ఆచారి చికెన్, బిర్యానీ, పులావ్, కర్రీస్ తయారు చేయడానికి ఉపయోగించి మసాలా దినుసులను మాత్రమే ఉపయోగించి చేయవచ్చు. ఈ స్పైసీ డిష్ ను అందరూ ఇష్టంగా తినవచ్చు.

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups
పచ్చిబఠానీ: 3tbsp
బీన్స్, క్యారెట్: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
లవంగాలు: 2
యాలకులు: 2
చెక్క: చిన్న ముక్క
కుంకుమ పువ్వు: చిటికెడు
షాజీర: 1/2tsp
పాలు: 1tsp
బిర్యాని ఆకు: 1
నూనె లేదా నెయ్యి: 3tbsp
ఉప్పు : రుచికి సరిపడా
ఆచారికి కావలసిన పదార్థాలు:
పన్నీర్: 2cups(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 1/2cup
పసుపు: 1/2tsp
మెంతులు: 1/4tsp
ఆవాలు: 1/2tsp
పచ్చిమిర్చి ఊరగాయ మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
ఆవనూనె: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక లోతైనటువంటి ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో బియ్యాన్ని శుభ్రంగా కడిగి సరిపడి నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి.
2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పాలు వేసి అందులో కుంకుమ పువ్వు వేసి బాగా నాననివ్వాలి. కుంకుమపువ్వు పాలలో బాగా నాని పాలు కలర్ మారితన తర్వాత వాటిని చల్లారబెట్టిన అన్నంలో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత పెరుగు, పచ్చిమిర్చి పికెల్, పసుపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, ఆవ నూనె మరియు ఉప్పు ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. మసాలా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోని వంచుకొని అందులో పన్నీర్ ముక్కలను వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
5. అరగంట తర్వాత మసాలాలో ఉన్న పన్నీర్ ముక్కలను పక్కకు తీసుకొని, కొద్దిగా నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు తీయగా మిగిలిన మసాలను అలాగే పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత ఒక పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక అందులో షాజీర, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు వేసి వేయించాలి. తర్వాత అందులోనే మిగిలిన మసాలా పేస్ట్ ను కూడా రెండు నిముషాలు వేయించి, అందులోనే పచ్చిబఠానీ, బీన్స్, క్యారెట్ కూడ వేసి బాగా ఉడికించాలి కొద్దిసేపటి తర్వాత అందులో అన్నం, వేయించి పెట్టుకొన్న పన్నీర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే పన్నీర్ పలావ్ రెడీ. ఏదేని సైడ్ డిష్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications