స్పైసీ పనీర్ మాసలా బాల్టి -స్పెషల్ డిష్

బాల్టి రిసిపి. ప్రత్యేకంగా పాకిస్తాన్ లేదా కాశ్మీర్ వంటలుగా చెబుతారు. ఈ బాల్టీ స్టైల్ రిసిపిలు చాలా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఈ వంటకు మరో ప్రత్యేకత, పనీర్ ను ఉపయోగించి తయారుచేస్తారు.

చాలా తక్కువ మసాలాదినుసులు ఉపయోగించి తయారుచేసే ఈ వంట రుచి అంద్భుతంగా ఉంటుంది. మరియు మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి ఈ వంటను పనీర్ మసాలా బాల్టి రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Paneer Masala Balti

Image Courtesy: Twitter

కావల్సిన పదార్థాలు :
పనీర్: 500grm(మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి.
పచ్చిమిర్చి: 4(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
ధనియాల పొడి: 2tsp
పసుపు: 1tsp
జీలకర్ర: 1tsp
గరం మసాలా: 1tsp
టమోటో పేస్ట్: 1tbsp
కర్రీసాస్: 600ml(వేడి చేసినది)
కొత్తిమీర : కొద్దిగా(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉప్పులేనటువంటి బటర్: 50g
ఉప్పు : రుచికి సరిపడా
పెప్పర్: 1/2tsp
వెజిటేబుల్ ఆయిల్: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం :
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ వేసి, వేడయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. పన్నీర్ ముక్కలు వేగుతూ, కొంచెం పెద్దముక్కలుగా మారి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక పేపర్ టవల్ మీదకు మార్చుకొని వాటినిలోని నూనె ఇంకిపోయలా కొద్దిసేపు పేపర్ టవల్ మీద పరవాలి.
3. ఇప్పుడు అదే పాన్ స్టౌ మీద పెట్టి ఎక్కువగా మంట పెట్టి నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30సెకెండ్లు ఫ్రై చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయే వరకూ వేగిస్తుండాలి.
4. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులోనే గ్రైండ్ చేసుకొన్న మసాలా దినుసులు మరియు టమోటో పేస్ట్ వేసి వేయించుకోవాలి.
5. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత కర్రీ సాస్ ను వేసి మిక్స్ చేస్తూ, అలాగే బటర్ ను కూడా మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొత్తిమీర తరుగు కూడా వేసి, బటర్ కరిగే వరకూ వేడి చేాయలి.
6. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకొన్న పనీర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసి ఉడికించాలి.
7. అంతే మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత వెంటనే వడ్డించినప్పటకంటే, అరగంట తర్వాత చల్లారిన తర్వాత వడ్డిస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

Desktop Bottom Promotion