Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్టఫ్డ్ కాప్సికమ్
Veg
oi-Saraswathi N
By Sindhu

కాప్సికమ్: 6
ఉడకబెట్టిన ఆలూ: 2
ఉడకబెట్టిన పచ్చి బఠాణి: 1/2cup
ఉల్లిపాయ: 2(సన్నగా తరిగినది)
పసుపు: 1/4tsp
కారం: తగినంత
గరం మసాలా: 2tsp
ఆమ్‌చూర్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
తయారు చేసే విధానం:
1. క్యాప్సికమ్ ను శుభ్రంగా కడిగి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో నీటిని వంచేసి చల్లారనివ్వాలి.
2. ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డను చిదమాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.
3. ఇందులో మసాలా దినుసులు, ఆలుగడ్డ చిదుము, బఠాణీలు వేసి కొద్ది నిమిషాలు వేయించాలి. చాకుతో కాప్సికమ్ తొడిమను, లోపల ఉన్న గింజలను తొలిగించాలి.
4. తర్వాత చేసి వేయించిన స్టఫింగ్ ను అందులో జాగ్రత్తగా పెట్టాలి. మరొక పాన్ పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసి స్టఫ్ చేసుకున్న కాప్సికమ్ ను అందులో వేసి అన్ని వైపుల నుంచి వేయిం చాలి. వేగిన కాప్సికమ్ మీద పనీర్ తురుము, కొత్తిమీర ఆకులు, గుండ్రంగా తరిగిన టమాటాలతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
Comments
Read more about: capsicum potato green chili green pease onion gram masala క్యాప్సికమ్ పొటాటో పచ్చిబఠాణి ఉల్లిపాయ పుసుపు గరం మసాలా
English summary
Capsicum | Potato | Green Chili | Green Pease | Onion | Gram Masala | స్టఫ్డ్ కాప్సికమ్
Story first published: Friday, July 1, 2011, 16:44 [IST]
Other articles published on Jul 1, 2011



Click it and Unblock the Notifications