Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్టఫ్డ్ వెజిటేబుల్ ఆలూ

బంగాళదుంపలు: 6-8
కాలీఫ్లవర్ పూలు: 2
ఉల్లిపాయలు: 1
కాప్సికమ్: 1
పచ్చి బఠాణీలు: 1tbsp
పచ్చి మిర్చి: 4-6
టొమాటోలు: 4
వెల్లుల్లి: 4-6రెబ్బలు
ఉప్పు: రుచికి తగినంత
నీళ్ళు: తగినన్ని
నెయ్యి: 1/4cups
కొత్తిమీర తరుగు: 1tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా ఆలుగడ్డలకు పై పొట్టు తీసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను పై పావు భాగం తీసి వేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ముప్పావు భాగం మధ్యలో జాగ్రత్తగా చిన్న గుంట ఏర్పడేలా తియ్యాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి తగినంత ఉప్పు వేసి కాలీఫ్లవర్ తరుగు, కాప్సికమ్ తరుగు, పచ్చిబఠాణీలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చివేసి నీరంతా ఇంకిపోయే దాకా ఉడికించాలి.
4. తర్వాత ఈ మిశ్రమాన్ని మధ్యలో గుంటలా చేసిన ఆలుగడ్డలో నింపాలి. తర్వాత పక్కన పెట్టుకున్న బంగాళదుంపల పై భాగాన్ని మూతలా పెట్టి విడిపోకుండా ఉండేందుకు ఒక టూత్ ప్రిక్(మందపాటి పుల్ల) ను గుచ్చాలి.
5. ఇప్పుడు పాన్ లో నూనె వేసి పోసి వేడి చేసి అందులో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చేర్చి రెండు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత మసాలా నింపిన ఆలుగడ్డలను ఈ టమాటా మిశ్రమంలోకి జాగ్రత్తగా వేసి, మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అంటే అవి మృదువుగా అయ్యే వరకు ఉడికించాలి. దించిన తర్వాత దానిపై కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇవి రోటీలేదా పరాటాలోకి మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications