Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్వీట్ కార్న్ అండ్ ఆలూ ఫ్రై : హాట్ అండ్ స్పైసీ
సాధారణంగా ఎప్పుడూ తినే వంటలైతే చాలా బోరుకొడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా స్పైసీగా మరియు స్వీట్ గా తినాలని కోరుకుంటున్నట్లైతే ఈ యమ్మీ ట్రీట్ కార్న్ మరియు ఆలు అద్భుతమైనది
ఈ రుచికరమైన వంటలో మిచ్చి మరియు స్వీట్ కార్న్ ను జోడించడం వల్ల ఈ డిష్ స్పైసీగా టేస్ట్ బడ్స్ కు ఒక కొత్త రుచిని పరిచయం చేస్తుంది.
ఈ ఆలూ స్వీట్ కార్న్ రిసిపిని వెజిటేరియన్ పులావ్ తో పాటు తీసుకోవాలి. రోటీలకు అంత రుచిగా ఉండకపోవచ్చు. రైస్ ఐటమ్స్ కు ఫర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ స్వీట్ అండ్ హాట్ డిష్ ను ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
ఆలు: 1/2 kg (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
స్వీట్ కార్న్: 4tbsp(ఒలిచి, శుభ్రం చేసి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం & వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు పొడి: 1 / 2 tsp
కారం: 1tbsp
నీరు: 1cup
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత మిగిలిన పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే పసుపు, కారం, కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లోసన్నగా తరిగిపెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి ఫ్రై చేసి 5నిముషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి.
5. మూత తీసి, అందులో బంగాళదుంప ముక్కలు వేసి మిక్స్ చేసి నీళ్ళు పోసి మరో 10నిముషాలు ఉడికించుకోవాలి.
6. కొద్దిసేపటి తర్వాత అందులో ఉప్పు, మరియు స్వీట్ కార్న్ వేసి ఉడికించుకోవాలి. 5 నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే



Click it and Unblock the Notifications