Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆంధ్ర ఫేమస్ అనపగింజల పులుసు

అనపకాయలు: 1/2kg(పొట్టు తీసి గింజలు సపరేట్ చేసుకోవాలి)
టమోట: 2
ఉల్లిపాయ: 2
వెల్లుల్లి: 5రెబ్బలు
కొబ్బరి: చిన్న ముక్క
జీలకర్ర: 1/2tsp
మిరియాలు: 1/2tsp
ధనియా: 2tsp
కారం: 1 1/2tsp
పసుపు: 1/2tsp
కొత్తిమీర: కొద్దిగా
కరెపాకు: రెండు రెమ్మలు
ఆవాలు: 1tsp
చింతపులుసు: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినింత
తయారు చేయు విధానము:
1. మొదటగా అనపకాయల నుండి గింజలను వేరు చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో అనపగింజలను వేడినీళ్ళలో వేసి ఉడికించాలి. అందులోనే 1టమోటో, చిన్న ఉల్లిపాయ కూడా వేసి ఉడించికించి, టమోటో, ఉల్లిపాయను పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత గింజలు ఉడుకుతున్నంతలో పులుసుకు రెడీ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి తురుము, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉడికించిన ఉల్లిపాయ, టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే కారం, ధనియా, పసుపు, కొత్తిమీర, ఉడుకుతున్న అనపగింజలు ఒక చెంచా వేసి మెత్తగా గ్రైడ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని ఉడుకుతున్న గింజల్లో పోసి, బాగా కలియబెట్టాలి. తర్వాత ఒక టమోటో కట్ చేసి అందులో గింజలు మొత్తబడే వరకూ ఉడికించాలి. చివరగా రెండు టీస్పూన్ల చింత పులుసు అందులో కలిపి దింపుకోవాలి.
6. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగించి గింజల పులుసును అందులో పోసి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే అనప గింజల పులుసు రెడీ. ఇది వేడి వేడి అన్న, ముద్ద(సంగటి), చపాతిలలోకి చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications