Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ సేమ్యా ఉప్మా.

కావలసిన పదార్ధాలు:
సేమ్యా (వెర్మిసెల్లి): 2cupsl
పొటాటో: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
కారట్: 2(చిన్న ముక్కలుగా తరిగినవి)
బీన్స్: 1/2cup (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమాటా: 1(చిన్న ముక్కలుగా తరిగినవి)
నెయ్యి: 1tsp
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి: 3
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: కొంచెం
పసుపు: చిటికెడు(అవసరం అనుకుంటే
ఉప్పు : రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద: 1/2tsp
గరంమసాలా పొడి: 1/2tsp
నూనె: తగినంత
జీడిపప్పు: 8
నీళ్ళు : 2cups
తాలింపుకు: శనగపప్పు,మినప్పప్పు ,ఆవాలు
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ లో ఒక టీస్పూన్ నెయ్యి వేడిచేసి సేమ్యా వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. అదే పాన్ లో నూనె వేసి, వేడి అయ్యాక తాలింపు వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటో, కారట్, బీన్స్ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం వేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.
4. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి వేయించి ఆవిరిలోనే కొంచెం ఉడికించి , నీరు పొయ్యాలి.
5. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి నీళ్ళు మరిగిన తరువాత వేయించిన సేమ్యా వెయ్యాలి. ఒకసారి కలిపి ఈ గిన్నెను ప్రెషర్ పాన్ లో ఉంచి మూడు విజిల్స్ రానిస్తే సేమ్యా ఉప్మా రెడీ అవుతుంది. కుక్కర్ లో కాకుండా సేమ్యా ఉడికేవరకూ ఉంచి విడిగా కూడా చేసుకోవచ్చు. చివరగా కొత్తిమిర తరుగు, జీడిపప్పుతోటి గార్నిష్ చేసి ఏదైనా చట్నీ లేదా మీకు నచ్చిన ఊరగాయతోటి సర్వ్ చేయడం.



Click it and Unblock the Notifications