Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్
ఈ మధ్య కాలంలో వాతావరణం తరచుగా మారుతోంది. ఉదయం ఎండ, సాయంత్రం వాన.. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు రావడం సహజం. ఇలాంటప్పుడు నోటికి రుచిగా, కారంగా, ఘాటుగా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది. అయితే అలాంటి సమయంలో మనకు వెంటనే గుర్తొచ్చేది మసాలాలతో ఘుమఘుమలాడే నాన్ వెజ్ వంటకం. అందులోనూ చికెన్ పెప్పర్ గ్రేవీ చేసుకుని తింటే ఆ మజాయే వేరు.

మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది జలుబు, దగ్గును ఇట్టే తగ్గించి గొంతుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ చికెన్ పెప్పర్ గ్రేవీ కేవలం వేడి వేడి అన్నంలోకే కాకుండా.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చేసుకునే ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ, పరోటాలలోకి కూడా అద్భుతమైన కాంబినేషన్. వర్షాకాలంలో ఈ స్పైసీ గ్రేవీని ఆస్వాదించడం ఒక మధురమైన అనుభూతి.
చికెన్ పెప్పర్ గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
వంట నూనె - 1 టీస్పూన్
మిరియాలు లేదా మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు - అర టీస్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
కల్పాసి (రాతి పువ్వు) - కొద్దిగా
అనాస పువ్వు (స్టార్ అనాస్) - 1
లవంగాలు - 2
యాలకులు - 2
ఎండు మిరపకాయలు - 5
జీడిపప్పు - 5
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి - 5 రెబ్బలు
పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి - 2 చిన్న ముక్కలు
గ్రేవీ తయారీకి కావలసినవి:
చికెన్ - 1 కేజీ
వంట నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 2
టమాటో - 1
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 1 కట్ట
పసుపు - 1/4 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా

చికెన్ పెప్పర్ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో మిరియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు, ధనియాలు, జీడిపప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి వేసి పచ్చివాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టి, అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి (నువ్వుల నూనె వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది). నూనె వేడెక్కాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు చల్లండి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారి మెత్తబడే వరకు వేయించండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో
తరిగిన టమాటో ముక్కలు వేసి, అవి మెత్తగా గుజ్జులా మారే వరకు
ఉడికించండి.
టమాటోలు బాగా మగ్గిన తర్వాత, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కిలో
చికెన్ ముక్కలను అందులో వేసి బాగా కలపండి. చికెన్‌ను నూనెలో
సుమారు 5 నిమిషాల పాటు వేయించండి. ఇలా చేయడం వల్ల ముక్కలకు మంచి రుచి
పడుతుంది.
-ఇప్పుడు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను చికెన్ లో వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపండి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి మీకు కావలసినంత నీరు పోసి, మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు సన్న మంట మీద చికెన్ ను ఉడికించండి.
-చికెన్ మెత్తగా ఉడికి, గ్రేవీలోని నూనె పైకి తేలుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను పైన చల్లుకుంటే నోరూరించే వేడి వేడి చికెన్ పెప్పర్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
