Latest Updates
-
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన టమాటా వెల్లుల్లి రైస్..బ్యాచిలర్స్ కు పండగే పండగ -
ముల్లంగి ఆకులతో ఇలా పకోడీ చేసి చూడండి..లొట్టలేసుకుంటూ తింటారు! -
భారతదేశంలో తొలి సూర్యోదయం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ మటర్ పనీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్ -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం -
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్!
రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఏం చేయాలా అనే ఆలోచన ప్రతి ఇంట్లో ఉండేదే. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మాలకు భిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేసే సరికొత్త వంటకం రుచి చూడాలని ఉందా? అయితే కర్ణాటక సంప్రదాయ వంటకమైన సొరకాయ కడుబు బెస్ట్ ఆప్షన్.
బియ్యం రవ్వ, లేత సొరకాయ తురుము, సువాసనభరితమైన సోయా కూర కలిపి, అరటి ఆకుల్లో చుట్టి ఆవిరి మీద ఉడికించే ఈ వంటకం అత్యంత మృదువుగా, రుచికరంగా ఉంటుంది. నూనె వాడకం దాదాపుగా ఉండదు కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

సొరకాయ కడుబు తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం రవ్వ - 1 కప్పు
తురిమిన లేత సొరకాయ - ఒకటిన్నర కప్పులు
సన్నగా తరిగిన సోయా కూర (Dill leaves) - అర కప్పు
గట్టి పెరుగు - 1/3 కప్పు
నానబెట్టిన పచ్చిశెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
అల్లం తురుము - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
అరటి ఆకులు - కడుబులు చుట్టడానికి తగినన్ని
ఐరన్ గని, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. ఎన్నో లాభాలున్న హలీమ్ సీడ్స్ లడ్డూ ఎలా చేసుకోవాలంటే..
సొరకాయ కడుబు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో బియ్యం రవ్వ, తురిమిన సొరకాయ, తరిగిన సోయా కూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు, అల్లం తురుము, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. సొరకాయలో సహజంగానే నీటి శాతం ఉంటుంది కాబట్టి అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అన్నింటినీ చేత్తో బాగా కలుపుకుని, మూతపెట్టి ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రవ్వ మృదువుగా మారుతుంది.
-ఈలోపు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, చిన్న దీర్ఘచతురస్రాకారపు ముక్కలుగా కట్ చేసుకోండి. ఆకులను మడిచేటప్పుడు అవి చిరిగిపోకుండా ఉండాలంటే, వాటిని స్టవ్ మంట మీద కొద్దిగా వాడ్చాలి. ఇలా చేయడం వల్ల ఆకులు మెత్తబడి సులభంగా మడవడానికి వీలవుతుంది.
-ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమం నుండి కొద్దికొద్దిగా తీసుకుని, ఒక్కో అరటి ఆకు మధ్యలో ఉంచండి. ఆకును రెండు వైపులా మూసివేస్తూ మడవండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఆకుల్లో చుట్టి పెట్టుకోండి.
ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు వేడయ్యాక, అందులోని ప్లేట్ల మీద మనం మడతపెట్టి ఉంచుకున్న అరటి ఆకులను జాగ్రత్తగా పేర్చండి. మూతపెట్టి మీడియం మంటపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఆవిరి మీద బాగా ఉడికించాలి.
-కడుబులు లోపల వరకు పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వాటిని వెంటనే తెరవకుండా కాస్త చల్లారనివ్వండి. అరటి ఆకులో ఆవిరి మీద ఉడకడం వల్ల వచ్చే కమ్మటి సువాసన మీ ఇల్లంతా వ్యాపిస్తుంది.
-అంతే ఎంతో సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే వేడివేడి సొరకాయ కడుబు రెడీ. వీటిని అరటి ఆకులో నుంచి తీసి, కారంగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చడి లేదా పల్లి చట్నీతో తింటే ఆ రుచే వేరు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నే కాకుండా, సాయంత్రం వేళ స్నాక్ గా కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
