Latest Updates
-
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!
భాగస్వామితో గొడవైనప్పుడు పొరపాటున కూడా ఇలా చేయకండి.!
ఆధునిక జీవనశైలిలో భార్యాభర్తల మధ్య అనురాగం కంటే మనస్పర్థలే ఎక్కువగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. దంపతులిద్దరూ ఉద్యోగాల్లో ఉండటం, తీరికలేని పనులు, భాగస్వామితో మాట్లాడటానికి సమయం లేకపోవడం ఇలా పలు కారణాల వల్ల వారి మధ్య ఏకాంతం, ప్రేమ అనేది తగ్గిపోతుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఫలితంగా గొడవలు, అపార్థాలు, సంభాషణ లోపం, ఒకరిపై ఒకరికి అంచనాలు పెరిగి సంబంధాలను బలహీనపరుస్తున్నాయి.

గతంతో పోలిస్తే ఈనాటి బంధాల్లో విడిపోవడం అనేది సర్వసాధారణంగా మారిందనే చెప్పవచ్చు. అయితే ఏ బంధాన్నైనా గొడవల కారణంగా ముగించడం కంటే ప్రేమతో కొనసాగించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరి మధ్య అవగాహన, గౌరవం, నమ్మకం అనేది ఉంటే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు.
నలుగురిలో వద్దు
కాగా, భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరగడం అనేది ఏ ఇంట్లో అయినా కామన్. అయితే అలా విభేదాలు తలెత్తినప్పుడు నలుగురిలో కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబీకులైనా, బయటివారైనా వారి ముందు మీ పొరపాట్లు, తప్పులను ఎత్తి చూపడం ద్వారా బంధం బలహీనపడుతుందే కానీ బలపడదు. మీ గదిలో మీ ఫిర్యాదులను, సమస్యలను మీ భాగస్వామి ముందు ఉంచి బహిరంగంగా మాట్లాడుకుంటే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది.

ఇవి తప్పనిసరి
ఆరోగ్యకరమైన బంధంలో కేవలం ప్రేమ మాత్రమే కాకుండా.. నమ్మకం, నిజాయతీ, సంభాషణ, భావాలకు విలువ అనేవి కీలకం. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వీటి బలం కారణంగా మనస్పర్థలు తొలగిపోతాయి. భాగస్వామి మాట వింటూ, వారిని గౌరవిస్తూ బంధం బలోపేతంపై దృష్టి సారించినట్లయితే దాంపత్య బంధం దీర్ఘకాలం నిలిచి ఉంటుంది.
బహిరంగ సంభాషణ
భార్యాభర్తల బంధానికి మంచి సంభాషణ బలమైన పునాదిగా నిలుస్తుంది. భాగస్వామి వద్ద మీ భావాలను, ఆశలను, ఆందోళనలను బహిరంగంగా పంచుకోండి. అదే విధంగా ఎదుటి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినడం కూడా అంతే అవసరం. మీ మధ్య అపార్థాలు తలెత్తకముందే ఇలాంటి బహిరంగ సంభాషణల ద్వారా గొడవలు జరిగే అవకాశం ఉండదు.
నమ్మకం
దాంపత్య బంధంలో ఒకరిపై ఒకరికి నమ్మకం అతిపెద్ద బలాన్ని ఇస్తుంది. భాగస్వామి వద్ద అబద్ధాలు చెప్పడం, విషయాలను దాచిపెట్టడం, పదేపదే అవమానించడం వంటివి జరిగితే అవి సంబంధాన్ని మరింతగా బలహీనపరుస్తాయి. ఒక వ్యక్తిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఒకసారి నమ్మకం కోల్పోతే దాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం చాలా కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిజాయతీ, పారదర్శకతతో బంధాన్ని కాపాడుకోవాలి.

గౌరవం
భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు గౌరవం కూడా ఉండాలి. మీ మధ్య విభేదాలు తలెత్తినప్పుడు దుర్భాషలాడటం, తక్కువ చేసి మాట్లాడటం, అందరిముందు కించపరిచేలా మాట్లాడటం వంటివి చేయకూడదు. బంధంలో ఒకరిపై ఒకరికి గౌరవం ద్వారా అది దీర్ఘకాలం ఆరోగ్యకరంగా ఉంటుంది.
నాణ్యమైన సమయం
మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంత బిజీగా ఉన్న మీ భాగస్వామి కోసం కాస్త సమయం కేటాయించడం తప్పనిసరి. అప్పుడప్పుడూ కలిసి బయటకు వెళ్లడం, కలిసి భోజనం చేయడం, ఇష్టమైన పనులు చేయడం వంటి వాటి ద్వారా భావోద్వేగపరంగా ఒక్కటవుతారు. ఇలాంటి సమయాల్లో మొబైల్ ఫోన్‌కి దూరంగా ఉండాలి. మీ కుటుంబ బాధ్యతలతో సమానంగా మీ భాగస్వామికి సమయం కేటాయించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు వాటిని కోపంతో, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉండకండి. సమస్యపై దృష్టి సారించి శాంతియుతంగా పరిష్కరించుకోండి. అవసరమైతే కొంత సమయం తీసుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
