For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బెస్ట్ ఫ్రెండ్ తో లవ్ లో పడ్డారా? లేదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా?

|

కష్టాల్లో ఉన్నప్పుడు కామిడీ చేసేవారు.. కల్లబొల్లి కబుర్లు చెప్పేవారు.. కంటెంట్ లేకున్నా.. ఏదైనా కథనాన్ని కళ్లకు కట్టినట్టు చూపేవారు.. కీలకమైన విషయాల్లో కామ్ గా ఉండేవారు.. ఆ విషయంలో మాత్రం 'కన్నింగ్'నైస్ గా ఉండేవారు..

ఖర్చులకు లేనప్పుడు కాసులు ఇచ్చేవారు.. కుమ్ములాటలో కత్తిలా దూసుకొచ్చేవారు... కడలిని సైతం తమ కాళ్ల దగ్గరికి రప్పించుకునేవారు.. మీ జీవితంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారే మీకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. అయితే అలాంటి బెస్ట్ ఫ్రెండ్ తో మీరు ప్రేమలో పడితే? ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఇంతకీ అది ప్రేమేనా కాదా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ఎంతో విలువైనది స్నేహం..

ఎంతో విలువైనది స్నేహం..

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన అనుభూతిలా ఉంటుంది. దాన్ని తలచుకుంటేనే ప్రేమలో ఉండే వారి మనసు పులకించిపోతుంది. అయితే అలాంటి ప్రేమ అందరికీ దక్కదు. లవ్ అంటే ఒక స్వచ్ఛమైన భావన. ఇది అందరికీ దక్కదు. ఇది దక్కాలంటే లక్కీ ఉండాలి. ఎందుకంటే నిజాయితీగా ఉండే ప్రేమలో ఎప్పటికీ స్వార్థం అనేదే ఉండదు. అయితే ప్రేమ అనేది ప్రతి ఒక్కరి బంధంలో ఉంటుంది. తల్లీబిడ్డల మధ్య, తండ్రి కూతురు మధ్య.. అన్నా చెల్లెల మధ్య, అక్కా తమ్ముడి మధ్య ఇలా రకరకాల ప్రేమలు ఉంటాయి. అయితే బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమలో పడితే.. అలాంటి స్నేహితుడితో ప్రేమ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఎంతో విలువైనది స్నేహం..

ఎంతో విలువైనది స్నేహం..

ఈ ప్రపంచంలో ప్రేమకు మించింది ఏది లేదు అని కొందరు అంటే... స్నేహానికి మించింది ఏది లేదు అని అంటూ ఉంటారు. అందుకే వంద పుస్తకాలు చదివే కన్నా ఒక్క మంచి స్నేహితుడే మిన్న అని గొప్ప వారంతా చెబుతారు. ఎందుకంటే స్నేహం చాలా విలువైనది. అయితే అందరికీ నిజమైన స్నేహం దొరకదు. అది అందరికీ దక్కడం చాలా కష్టం.

ప్రేమలో సంతోషం..

ప్రేమలో సంతోషం..

ఫ్రెండ్ షిప్ లో ఏ ఇద్దరు వ్యక్తులు సమానంగా ఉండరు. ఇద్దరూ కచ్చితంగా భిన్నంగా ఉండి ఉంటారు. అయినా కూడా స్నేహం ఎంతో విలువైనదిగా భావిస్తారు. అలాంటి సంఘటనలే మీ ప్రేమకు సంతోషాన్ని ఇస్తుంది.

ఇష్టాయిష్టాలు..

ఇష్టాయిష్టాలు..

కాలేజీలు మరియు కార్యాలయాల వంటి చోట్ల అమ్మాయిలు, అబ్బాయిల మధ్య సాధారణంగా చాలా మంచి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. వారి అవసరాలు, అభిరుచులు వంటి అనేక కారణాల వల్ల పరిచయాలు ఏర్పడతాయి. అలా ఏర్పడిన పరిచయాలే ఫ్రెండ్ షిప్ గా మారుతుంది. అలా ఫ్రెండ్ షిప్ ద్వారా ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటారు. అలా వారి ఇష్టయిష్టాలు కలిసిపోతాయి. అలా వారి మనసులను అర్థం చేసుకున్న తర్వాత వారి ఫ్రెండ్ షిప్ ఎక్కువ కాలం కొనసాగుతుంది. అలా స్నేహం చాలా బలంగా మారుతుంది.

ఎలా అర్థం చేసుకోవాలంటే?

ఎలా అర్థం చేసుకోవాలంటే?

అయితే ప్రేమకు మరియు స్నేహానికి చాలా మంది యువతలో అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. ఏది ప్రేమ, ఏది స్నేహం, ఏది ఆకర్షణ అనే విషయాల్లో చాలా సతమతమవుతుంటారు. అయితే ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడూ కన్ ఫ్యూజ్...

ఎప్పుడూ కన్ ఫ్యూజ్...

స్నేహం, ప్రేమ విషయంలో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే, స్నేహాన్ని స్నేహంగానే ఎలా స్వీకరించాలి. ప్రేమను ఎలా గుర్తించాలి. అలాంటి స్నేహం మలుపు తీసుకుని ప్రేమగా మారుతుందా? అసలు ప్రేమకు, స్నేహానికి మధ్య తేడాను ఎలా గుర్తించాలనే విషయంలో యువత ఎప్పుడూ కన్ ఫ్యూజ్ అవుతూ ఉంటారు.

లవ్ లో పడ్డారనిపిస్తే..

లవ్ లో పడ్డారనిపిస్తే..

మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమలో పడినట్టు అనిపిస్తే? వారు ఎవరితో అయినా క్లోజ్ గా మాట్లాడినప్పుడు మీరు జలసీగా ఫీలవుతుంటే మీరు ప్రేమలో ఉన్నారని భావించొచ్చు. అయితే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమలో పడటంలో తప్పు లేదు. అది ఒకవైపు ఉంటే తప్ప లేదా మీరు ఇది వరకే వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉంటే తప్పు.

రెండింటి మధ్య చిన్న గీత..

రెండింటి మధ్య చిన్న గీత..

మీరు, మీ స్నేహితులతో ఎంత సన్నిహితంగా ఉన్నా, మీరు అతనితో/ఆమెతో ఆరోగ్యకరమైన కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే స్నేహానికి, ప్రేమకు మధ్య చిన్న గీత మాత్రమే ఉంటుంది. మీరు దాన్ని గుర్తిస్తే చాలు. మీ ఫ్రెండ్ షిప్ హెల్దీగా కొనసాగించడం చాలా సులభమవుతుంది.

ఆత్మపరిశీలన

ఆత్మపరిశీలన

అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ భావోద్వేగాలను గమనించుకుంటూ ఉండాలి. మీరు మీ స్నేహితులని ప్రేమిస్తున్నారని భావిస్తే, దాని గురించి మీరు ఒకసారి స్వయంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బాగా ఆలోచించుకున్నాక మీ మనసులో మీకు ఏమి అనిపిస్తుందో మీరు గ్రహించండి. మిమ్మల్ని మీరు క్రమశిక్షణతో ఉంచుకోండి. ఎదుటి వ్యక్తితో మీకు ఉన్న ఆరోగ్యకరమైన ఫ్రెండ్ షిప్ కు విలువ ఇవ్వండి.

ఎలాంటి సమస్యలైనా...

ఎలాంటి సమస్యలైనా...

అయితే మనలో చాలా మందికి ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేవారు ఎవరో ఒకరుంటారు. అంతేకాదు మన ఫ్రెండ్స్ అన్ని విషయాల్లోనూ మనకు మద్దతుగా నిలుస్తారు. అయితే మీరు వారితో పంచుకునే విషయాలపై కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే విషయాన్ని ఎదుటి వ్యక్తి వేరే పద్ధతిలో అర్థం చేసుకుంటే సమస్యలు తలెత్తుతాయి.

తగినంత పరిణితి..

తగినంత పరిణితి..

ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ స్నేహితుడు/రాలిని హ్యాపీగా ఉంచే బాధ్యత మీపై ఉంది. మీ స్నేహితుడు లేదా స్నేహితురాలితో మీరు ప్రేమలో పడటానికి దారి తీసే సంఘటనల గురించి మాట్లాడేందుకు తగినంత పరిణితి చెందాలి. మీరు చాలా బాధ్యతాయుతంగా ఆలోచించి, మీ స్నేహాన్ని అలాగే ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ముఖ్యమని మీరు ఎప్పటికీ మరచిపోవద్దు.

English summary

Falling In Love with Your Best Friend – What to Do?

Here we talking about falling in love with your best friend - What to do? Read on