Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
పన్నీర్ అనగానే కు అందరికీ నోరూరుతుంది. వెజిటేరియన్స్ పాలిట పన్నీర్ ఒక వరం అని చెప్పొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ ఫంక్షన్ వచ్చినా పన్నీర్ బటర్ మసాలా, కడాయ్ పన్నీర్, షాహీ పన్నీర్.. ఇలా రొటీన్ కూరలే చేస్తుంటాం. కానీ అవే తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త డిఫరెంట్ గా, సూపర్ టేస్టీగా ఉండే కమ్మని కొత్తిమీర పన్నీర్ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అద్భుతమైన గ్రీన్ గ్రేవీతో, తాజా కొత్తిమీర సువాసనతో ఈ కర్రీ టేస్ట్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. చపాతీ, నాన్, పరాఠా.. దేనిలోకైనా ఈ కూర పర్ఫెక్ట్ కాంబినేషన్.

కొత్తిమీర పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - కొద్దిగా
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 3
జీడిపప్పు పలుకులు - 5 లేదా 6
కొత్తిమీర - ఒక గుప్పెడు
పన్నీర్ - 200 గ్రాములు
నూనె - తగినంత
ఉల్లిపాయ - 1
పసుపు - పావు టీస్పూన్
కశ్మీరీ కారం - అర టీస్పూన్
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - పావు టీస్పూన్
వేడి నీళ్లు - గ్రేవీకి తగినన్ని
చక్కెర - అర టీస్పూన్
ఫ్రెష్ క్రీమ్ - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర పన్నీర్ కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె కాగాక అందులో ఒక టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు అందులో జీడిపప్పు పలుకులు, ఒక గుప్పెడు కడిగిన తాజా కొత్తిమీర ఆకులు వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి వీలైనంత మెత్తని గ్రీన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-మళ్లీ స్టవ్ ఆన్ చేసి అదే పాన్ లో లేదా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మగ్గాక పసుపు, మంచి రంగు కోసం కశ్మీరీ కారం వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలా పేస్ట్ ను అందులో వేసి, మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి.
-ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి, గిలకొట్టిన పెరుగు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రేవీలో నూనె పైకి తేలేలా కుక్ చేయాలి. ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, గరం మసాలా, గ్రేవీకి సరిపడా వేడి నీళ్లు పోసి సుమారు 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించాలి.
-చివరగా ఈ కర్రీలో అర టీస్పూన్ చక్కెర, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో గుమగుమలాడే, టేస్టీ,స్పైసీ కొత్తిమీర పన్నీర్ కర్రీ రెడీ. వేడి వేడి రోటీ, నాన్ లేదా పుల్కాలతో దీన్ని సర్వ్ చేస్తే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications