For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పట్లో కేవలం కంటి చూపులతో.. మరిప్పుడు స్మార్ట్ చూపులతో..

మరి ఇప్పటి తరం వారు అయితే తమకు ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు వెంట పడి మరీ తమ మనసులో మాటను నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు.

|

ప్రస్తుత జనరేషన్ యువత అన్నింట్లో స్పీడును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎవరైనా అమ్మాయి లేదా అబ్బాయి కాస్త అందంగా కనిపించగానే వెంట పడి.. బతిమిలాడి మరీ తమ మనసులో మాటను చెప్పేస్తున్నారు.

 todays generation

ఇంకా కొందరు అయితే ప్రేమ విషయంలో సోషల్ మీడియాను తెగ వాడుకుంటున్నారు. అయితే అప్పటి తరం వారు ప్రేమ విషయంలో చాలా ఆచితూచి అడుగు వేసే వారు. ప్రేమలో విజయం సాధించేందుకు ఎంతో ఓర్పుగా ఉండేవారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. తమ ప్రేమను శాశ్వతంగా నిలుపుకునేందుకు ప్రయత్నించేవారు.

 todays generation

ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని ఎంతగానో ఆరాధించేవారు. మరి ఇప్పటి తరం వారు ఏమి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సందర్భంగా పాత తరం మరియు కొత్త తరం మధ్య ప్రేమ విషయంలో ఏయే తేడాలుండేవో ఈ స్టోరీలో చూద్దాం...

ఎవ్వరికీ తెలియకుండా...

ఎవ్వరికీ తెలియకుండా...

అప్పటి తరం వారు తమకు ఎవరైనా అమ్మాయి నచ్చితే వారిని చూపులతోనే ఆరాధించేవారు. అంతే తప్ప వారి మనసులో మాటను అంత త్వరగా బయట పెట్టేవారు కాదు. అసలు ఆ అమ్మాయిని చూస్తున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియకుండా ఎంతో జాగ్రత్త పడేవారు.

వెంట పడి..

వెంట పడి..

మరి ఇప్పటి తరం వారు అయితే తమకు ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు వెంట పడి మరీ తమ మనసులో మాటను నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అది కూడా అందరికీ తెలిసేలా పబ్లిక్ గానే చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మూగ మనసులు..

మూగ మనసులు..

అప్పటి తరం వారు తమ మనసుకు ఎవరైనా నచ్చితే.. వారిపై ప్రేమను తమ మనసులోనే దాచుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రేమ గురించి బయట పెట్టేవారు కాదు. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. ఎంతో కాలం పాటు మాటల్లేకుండా మూగగా వారిని ఆరాధించే వారే కానీ.. ఆ మాట బయట పెట్టడానికి చాలా తటపటాయించేవారు.

టెక్నాలజీని..

టెక్నాలజీని..

ఇప్పటి తరం వారు అయితే తమకు ఎవరైనా అమ్మాయి నచ్చితే ఎలాగోలా వారి నంబర్లు సంపాదిస్తున్నారు. వారికి పర్సనల్ మెసెజ్ లు లేదా వాట్సాప్, షేర్ చాట్ లేదా టిక్ టాక్ వంటి సోషల్ మీడియా సహాయంతో తమ ప్రేమ గురించి తెలియజేసేందుకు తహ తహ లాడుతున్నారు. అలా టెక్నాలజీని ప్రేమ కోసం బాగా ఉపయోగించుకుంటున్నారు.

అప్పట్లో ప్రేమ లేఖలు..

అప్పట్లో ప్రేమ లేఖలు..

అప్పట్లో తమ ప్రేమ గురించి తమ మనసులోని ఎదుటి వారికి చెప్పాలంటే ఎంతగానో ఆలోచించేవారు. ఫేస్ టు ఫేస్ చెప్పడానికి చాలా భయపడేవారు. అందుకే అమ్మాయి దగ్గర ఏదో ఒక కారణంతో పుస్తకం తీసుకుని అందులో ప్రేమ లేఖను పెట్టి ఇచ్చేవారు. ఆ లేఖ ఆమెకు నచ్చిందా ఒకే. లేదంటే వారి చెంప చెళ్లుమనేది. దీంతో వారి ప్రేమకు ఫుల్ స్టాల్ పడినట్లే. అయితే ఆ ప్రేమ లేఖకు మంచి స్పందన వచ్చిందంటే వారికి ప్రేమ రెక్కలొచ్చినట్టే.. అప్పటి నుండి వారు ఊహాలలో తేలిపోయేవారు.

ఇప్పుడంతా స్మార్ట్ చూపులు..

ఇప్పుడంతా స్మార్ట్ చూపులు..

అప్పట్లో అయితే ప్రేమ లేఖలుండేవి. మరి ఇప్పుడు మాత్రం స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని నేరుగా వాట్సాప్ చాటింగులు లేదా పర్సనల్ మెసెజ్ లు.. అదీ కుదరలేదంటే ఏదైనా యాప్ ల నుండి మంచి కొటేషన్స్ తీసుకుని వాటిని షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. వారు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే ప్రతి నిమిషం ఛాటింగ్ చేస్తూ ప్రేమ ప్రపంచంలో మునిగిపోయేవారు. అదే నెగిటివ్ రెస్పాన్స్ అయితే అంతే సంగతులు.. కొందరేమో కటకటాలపాలు అవ్వడం ఖాయం. లేదా వారి చేతిలో బలవ్వడం ఖాయం.

ప్రేమ లోకంలో విహరం..

ప్రేమ లోకంలో విహరం..

అప్పటి తరం వారిలో అమ్మాయి మరియు అబ్బాయి ప్రేమించుకుంటే.. వారు ఇద్దరూ ప్రేమ లేఖల్లోనే కలసి విహరించేవారు. ఆమె పుస్తకంలో అతను. అతని పుస్తకంలో ఆమె గురించి ప్రతిరోజూ ప్రేమ లేఖలు పెట్టేవారు. వాటిని భద్రంగా దాచుకుని మరీ చదువుకుని తెగ మురిసిపోయేవారు.

వీడియో కాలింగ్ విహారం..

వీడియో కాలింగ్ విహారం..

ప్రస్తుతం ప్రేమ లేఖలకు కాలం చెల్లిపోయింది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పట్లో ఎవరైనా ప్రేమించుకుంటే నేరుగా వీడియో కాలింగులు చేస్తున్నారు. ఇందుకోసం బిగో, గూగుల్ డియో, వాట్సాప్ వీడియో కాల్స్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. ఏకంగా ఫోన్ లోనే ఏమేమీ కావాలో అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

అప్పట్లో ప్రేమ పెళ్లి అంటే..

అప్పట్లో ప్రేమ పెళ్లి అంటే..

అప్పటి తరం వారిలో ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అయినా కూడా చాలా మంది ఎంతో సాహసం చేసి తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొన్న వారు ఉన్నారు. కొంత మంది అయితే ఆరోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆదర్శ వివాహాలు చేసుకున్నారు. వారంతా ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంటున్నారు.

ఇప్పట్లో పెళ్లి..

ఇప్పట్లో పెళ్లి..

అప్పటి తరం అయినా.. ఇప్పటి తరం అయినా ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే ధైర్యం కావాలి. ఇప్పుడు అయితే కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది కాబట్టి అప్పుడంతా రిస్క్ చేయాల్సిన పని లేకుండా పోయింది. ముందుగానే పెళ్లి కోసం అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నారు. హడావుడిగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే అప్పటి తరం వారి లాగా సంతోషంగా మాత్రం జీవితాన్ని గడపలేకపోతున్నారు.

English summary

What is the difference between todays generation and old generation?

Here we talking What is the difference between todays generation and old generation? Read on
Desktop Bottom Promotion