Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..
గుమ్మడికాయతో చేసిన కూరలు, స్వీట్లు, లేదా వడియాలు మీరు చాలాసార్లు తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా కరకరలాడే గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? వినడానికి కాస్త కొత్తగా అనిపించినా, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. కానీ కూర వండితే పిల్లలు తినడానికి మారాం చేస్తారు. అలాంటి వారికి ఇలా పూరీలు చేసి పెడితే, అందులో గుమ్మడికాయ ఉందనే విషయం కూడా తెలియకుండా ఇష్టంగా లాగించేస్తారు.

గుమ్మడికాయ పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ ముక్కలు - 250 గ్రాములు
ఉడికించిన బంగాళదుంప - 1
పచ్చిమిర్చి - 4
బొంబాయి రవ్వ (సూజీ)- 6 టీస్పూన్లు
గోధుమ పిండి - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
వాము - అర టీస్పూన్
కసూరి మేతి- కొద్దిగా
నీళ్లు - తగినంత
గుమ్మడికాయ పూరీ తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల గుమ్మడికాయను తీసుకుని, పైన ఉన్న గట్టి తొక్కను పూర్తిగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప, 4 పచ్చిమిరపకాయలు, 5-6 టీస్పూన్ల బొంబాయి రవ్వ వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, ఎక్కడా ముక్కలు లేకుండా అత్యంత మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ పేస్ట్ ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి.
-అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కసూరి మేతి, చేతితో నలిపిన వాము, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గోధుమ పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. గుమ్మడికాయ పేస్ట్ ఎంత ఉందో దాదాపు అంతే పరిమాణంలో పిండి పడుతుంది. పూరీ పిండిలా కాస్త గట్టిగా ముద్దలా పిసికి, మూతపెట్టి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ నాని పూరీలు కరకరలాడుతూ వస్తాయి.
-పది నిమిషాల తర్వాత పిండిని మళ్లీ ఒకసారి బాగా మర్దన చేయాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న పిండి నుండి చిన్న చిన్న ఉండలు తీసుకుని, మరీ పలచగా కాకుండా పూరీల్లా ఒత్తుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఒత్తి పెట్టుకున్న పూరీలను అందులో వేసి రెండు వైపులా తిప్పుతూ, లేత బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఇవి చక్కగా పొంగుతూ, క్రిస్పీగా వస్తాయి.
-అంతే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పూరీలు రెడీ. వీటిని మీకు నచ్చిన పచ్చడితో, మామిడికాయ ఊరగాయతో ఆస్వాదించవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ వెరైటీ పూరీలు చేసి పెడితే వారు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
