Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
అల్లు అర్జున్ రిలేషన్ షిప్ సీక్రెట్..భార్యాభర్తల గొడవలకు బన్నీ ఇచ్చిన సాలిడ్ సొల్యూషన్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెరపై ఎంత ఎనర్జిటిక్ గా కనిపిస్తారో, నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ బాధ్యత గల ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆయన గడిపే క్షణాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అల్లు అర్జున్ కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, జీవితాన్ని, బంధాలను చాలా లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి కూడా. ఆయన చెప్పిన ఒక చిన్న మాట, భార్యాభర్తలకే కాదు.. సమాజంలో ప్రతి ఒక్కరి రిలేషన్ షిప్ కు ఒక గొప్ప పాఠం.

ఆలోచింపజేసే సమాధానం
కొంతకాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సాధారణంగా భార్యాభర్తలు అన్నాక చిన్నచిన్న గొడవలు రావడం సహజం. ఆ క్రమంలో యాంకర్ అల్లు అర్జున్ ను అడుగుతూ.. మీ ఇంట్లో మీ ఇద్దరికీ (మీకు, మీ ఆవిడకు) గొడవ జరిగితే.. ముందుగా ఎవరు సారీ చెబుతారు? ఎవరు తగ్గుతారు? అని సరదాగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎవరైనా నేనే సారీ చెబుతాను అనో, లేదా ఆవిడే సర్దుకుపోతుంది అనో సమాధానం చెబుతారు. కానీ అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో ఆలోచింపజేసింది.
ఆ ప్రశ్నకు బన్నీ బదులిస్తూ.. నేను ఆవిడతో ఏదైనా ఒక విషయంలో విభేదించడం అయ్యానంటే.. అది కేవలం ఆ ఒక్క ఇష్యూకి మాత్రమే పరిమితం. మేము ఏదైనా ఒక విషయం గురించి కొట్టుకున్నా, లేదా తగువులాడుకున్నా.. ఆ ఒక్క ఇష్యూ విషయంలోనే నేను ఆవిడతో విభేదించినట్లు. అంతేగానీ, మొత్తంగా ఆమె వ్యక్తిత్వంతోనో, ఆమెతోనో నేను విభేదించినట్లు కాదు అని చాలా పరిపక్వతతో సమాధానం ఇచ్చారు.
జీవితానికి సరిపోయే గొప్ప పాఠం
నిజానికి మన జీవితంలో కూడా ఈ సూత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు ఎవరితోనైనా ఒక సమస్య వచ్చిందంటే.. అది కేవలం ఆ ఇష్యూకి లేదా ఆ సమస్యకు మాత్రమే పరిమితం కావాలి. కానీ మనం తరచుగా చేసే పొరపాటు ఏంటంటే.. ఒక చిన్న విషయంలో గొడవ రాగానే, ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచించడం మానేసి ఎదుటి వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాం. వాళ్ళ క్యారెక్టర్ ను, గతంలో జరిగిన పొరపాట్లను తవ్వుతూ నిందిస్తాం. నువ్వు ఎప్పుడూ ఇంతే.. అసలు నీ బుద్ధే అంత అంటూ మనిషిని దూషించడం మొదలుపెడతాం. ఇక్కడే అసలు సమస్య పక్కదారి పట్టి, బంధాలు బీటలు వారే పరిస్థితి వస్తుంది.
అదే అల్లు అర్జున్ చెప్పినట్లు ఆలోచిస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. గొడవ అనేది కేవలం ఆ సమస్య మీద మాత్రమే జరగాలి, ఆ వ్యక్తి మీద కాదు. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితులు, లేదా ఆఫీసులో సహోద్యోగులు.. ఇలా బంధం ఏదైనా సరే, మనం ఒకరి అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. మనం తప్పుబట్టాల్సింది ఆ అభిప్రాయాన్ని లేదా ఆ క్షణంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే. అంతేతప్ప, మనతో ఒక విషయంలో విభేదించినంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే నేడు ఎన్నో బంధాలు విడాకుల వరకు, బ్రేకప్స్ వరకు వెళ్తున్నాయి.



Click it and Unblock the Notifications