For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మాజీ ప్రేమికుని/ ప్రేయసి వద్ద ఎప్పుడూ బయటపెట్టకూడని విషయాలు!

|

జీవితంలో ముందుకు సాగడానికి మీరు ఇదివరకు విడిచిపెట్టిన గతాన్ని, అక్కడే ఉండనివ్వండి. తిరిగి ఆ గతంలోకి ప్రవేశించి, చిక్కులు కొని తెచ్చుకోకండి. మీరు తిరిగి మీ మాజీ ప్రేమికుని/ప్రేయసిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లైతే కనుక, వారికి మీరు ఎప్పుడూ టెక్స్ట్ చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయని తెలుసుకోవాలి.

ఇవి చాలా చిన్న విషయాలే అయినా కానీ మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయగలవు. మీరు ఇటువంటి పరిస్థితిని కోరుకోరు. మీరు మీ మాజీ ప్రేమికుని/ప్రేయసిని కలుసుకోవడం, మంచిదా, కాదా అని ఎంతగా చర్చించినప్పటికి, అంతిమ ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు వారిని కలుసుకోవడంలో తప్పులేనప్పటికి, కొన్ని విషయాలు మాత్రం మీరు వారికి తెలుసుకోవడానికి అనుమతించకూడదు.

కొన్ని సందర్భాల్లో, వారిని కలుసుకోవడం మీకు మంచి చేసినా, కొన్ని సందర్భాల్లో మీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో, మీ మాజీతో మీ పునరనుబంధం ఎటువంటి ప్రభావాన్ని చూపించదు.

ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ మరియు మానసిక స్థితిలో బ్రేక్అప్ చాలా ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు, సంబంధ విచ్ఛిన్నాలు చాలా బాధను మిగిలుస్తాయి. మీరు మీ మాజీ తో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉంటే, మీరు అతన్ని / ఆమెను సంప్రదించే విధానంలో చాలా జాగ్రత్త వహించాలి. మీ మానసిక ఉద్వేగాలపై ఆధారపడి ఏ నిర్ణయం తీసుకున్నా,మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. చివరకు చింత మీ చెంత మిగిలిపోతుంది.

కాబట్టి ఇప్పుడు, ప్రతిదీ మీరు నిజంగా ఏ రకమైన వారు మరియు మీ మాజీ ప్రేమికుని/ప్రేయసితో మీ బంధం ఏ విధంగా ముగిసింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదివరకు వారితో మీ సంబంధం ఏ మార్గంలో పయనించింది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, మీరు నిజంగా వారిని తిరిగి కలుసుకోవాలని అనుకుంటే, మీరు అతనికి / ఆమెకు మెసేజ్ చేస్తున్నప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.

మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

1. మీ గుండె ఎంతలా పగిలిపోయిందో వారికి చెప్పకండి:

1. మీ గుండె ఎంతలా పగిలిపోయిందో వారికి చెప్పకండి:

విడిపోవడం వలన మీ మానసిక ఆరోగ్యం ఎంతగా దెబ్బతిన్నదో, లేదా మనసుకు ఎంత తీవ్రమైన గాయాన్ని చేసిందో చెప్పవద్దు. మీగుండె ముక్కలైనప్పటికి, దాన్ని వారి వద్ద ప్రస్తావించకండి. దీనిని వారి ముందు బయట పెట్టకూడదు. మీరు ఎంత కృంగిపోయారో మీ మాజీ ముందు బయట పెట్టినట్లయితే, మీరు మళ్ళీ మీ హృదయాన్ని ముక్కలు చేయమని అడుగుతున్నట్లే! విడిపోయినప్పుడు మీరు అనుభవించిన వేదనను గురించి వారి వద్ద అస్సలు ప్రస్తావించకండి, ఎందుకంటే దానివలన మీరు మరింత బాధకు లోనవుతారు. మీ ప్రస్తుత పరిస్థితిలో, ఇది అస్సలు మంచిది కాదు.

2. మీరు వారి లేని లోటును భరించేలేకపోతున్నట్లు పేర్కొనకండి:

2. మీరు వారి లేని లోటును భరించేలేకపోతున్నట్లు పేర్కొనకండి:

మీరు వారిని తిరిగి పొందడం కోసం ప్రాకులాడుతున్నట్లు మీ మాజీ ప్రేమికుల వద్ద వ్యవహరించకండి. ఇలా చేస్తే మిమ్మల్ని నియంత్రించే అధికారం మీరే ఇచ్చినట్లు అవుతుంది. మీరు మీ మాజీ లేని లోటును భరించేలేకపోతున్నట్లు వారి వద్ద బయట పడితే, వారు మీ మీద పైచేయి సాధించినట్లే! మీరు మాజీ నుండి విడిపోయాక కోలుకోలేకపోయారని తెలుసుకుని, వారు మిమ్మల్ని చులకనగా చూడటం మొదలు పెడతారు. అప్పుడు మీరు వారి కొరకు అర్రులు చాచే ఒక వ్యక్తిగా మిగిలిపోతారు.

3. జీవితంలో మీరు ప్రస్తుతం ఏమి చేస్తున్నారనే సమాచారం వారికి మెసేజ్ ద్వారా అందజేయవద్దు:

3. జీవితంలో మీరు ప్రస్తుతం ఏమి చేస్తున్నారనే సమాచారం వారికి మెసేజ్ ద్వారా అందజేయవద్దు:

మీ మాజీకి మీ ప్రస్తుతాన్ని గురించిన సమాచారాన్ని తెలియనివ్వకండి. వారి వద్ద ఎప్పుడూ ఖచ్చితంగా వ్యవహరించినప్పటికిని, మీ మనసులోని వ్యధను బయటపడనివ్వకండి. మీ జీవితాన్ని గురించి వారు మిమ్మల్ని ప్రశ్నించనప్పుడు, మీకు మీరుగా దాని గురించి వారికి తెలియజేయవద్దు.

4. వారిని అసూయపర్చడానికి ప్రయత్నించకండి:

4. వారిని అసూయపర్చడానికి ప్రయత్నించకండి:

ఇది ఎప్పటికీ పని చేయదు. మీరు మెసేజ్ ద్వారా వారిని అసూయపర్చడానికి ప్రయత్నం చేస్తే, వారి లేని మీ పరిస్థితి మరీంత దిగజారిందనే భావన వారిలో కలుగుతుంది. కనుక వారి ముందు మిమ్మల్ని మీరు కించపరచుకున్నట్లే అవుతుంది. మీ అసలు ఉద్దేశ్యం వారికి అర్థం కాదు.

5. మీ వ్యక్తిత్వం విషయంలో రాజీపడకండి:

5. మీ వ్యక్తిత్వం విషయంలో రాజీపడకండి:

ఇది మాజీ ముందు మీ వ్యవహరణ శైలి మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చూపేలా ఉండాలి. మీ సమగ్రతను రాజీ పడేలా చేసే, దేనికైనా దూరంగా ఉండటం మంచిది. మిన్ను విరిగి మీద పడ్డా, మీరు మీలానే ఉండేలా వ్యవహరించాలి.

English summary

CERTAIN THINGS YOU SHOULD NEVER TEXT YOUR EX

Breakups have a very definite impact on a person"s emotional and mental state. Sometimes, breakups can be very traumatic. If you have the intention of maintaining healthy ties with your ex, you need to be very careful with the way you approach him/her. You shouldn"t let your feelings drive the decisions because you might end up regretting the result at the end.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more