Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
సాయంత్రం కాగానే చల్లటి గాలికి వేడిగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. రోజూ చేసే పకోడీలు, బజ్జీలు కాకుండా కాస్త వెరైటీగా, ఆరోగ్యంగా, అదే సమయంలో నోటికి కమ్మగా అనిపించే స్వీట్ ఏదైనా చేస్తే ఎంత బాగుంటుంది?
మీ ఇంట్లో కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు, అద్భుతమైన స్వీట్ రవ్వ బోండా తయారు చేయవచ్చు. పైన కరకరలాడుతూ, లోపల తియ్యటి కొబ్బరి-బెల్లం పూర్ణంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ బోండా రుచి అమోఘం.

స్వీట్ రవ్వ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ (సూజీ) - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
చక్కెర - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - ఒక చిటికెడు
బిర్యానీ ఆకులు- 2
తురిమిన పచ్చి కొబ్బరి - 1 కప్పు
బెల్లం పొడి - పావు కప్పు
నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు
చక్కెర - 1 టీస్పూన్
యాలకుల పొడి - పావు టీస్పూన్
నూనె-డీప్ ఫ్రై చేయడానికి
స్వీట్ రవ్వ బోండా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు, చిటికెడు ఉప్పు, బిర్యానీ ఆకులు వేసి మరిగించండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బిర్యానీ ఆకులను తీసేసి, అందులో మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి కరిగించండి.
-చక్కెర కరిగిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి, బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. రవ్వ దగ్గరపడి ముద్దలా అయ్యేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లారనివ్వాలి.
-ఇప్పుడు లోపలి పూర్ణం తయారు చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో పావు కప్పు బెల్లం పొడి వేసి, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కరిగించండి. బెల్లం కరుగుతున్నప్పుడు, తురిమిన కొబ్బరిని వేసి బాగా కలపాలి. ఇందులోనే ఒక స్పూన్ చక్కెర, యాలకుల పొడి చల్లి మిశ్రమం దగ్గరపడేదాకా ఉడికించి స్టవ్ ఆపేయండి. దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నూనె రాసుకుని చపాతీ పిండిలా బాగా వత్తుకోవాలి.
-ఈ రవ్వ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చేతిలో పూరీలా ఒత్తుకోవాలి. దీని మధ్యలో కొద్దిగా కొబ్బరి పూర్ణం పెట్టి అంచులు మూసేసి రౌండ్ గా లేదా కాస్త చదునుగా మీకు నచ్చిన ఆకారంలో బోండాలను తయారుచేసుకోవాలి.
-చివరగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేశాక మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, బోండాలను నెమ్మదిగా నూనెలో వేయాలి. ఇవి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు దోరగా వేయించి బయటకు తీయాలి.
-అంతే వేడివేడి, నోరూరించే స్వీట్ రవ్వ బోండా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications