Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రేమ లేదా వివాహ బంధం కోసం అన్నీ వదులుకోవాలా?
మీరు ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నప్పుడు, మీకు ఇష్టమైన ఉద్యోగం లేదా పనిలో ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఈ ప్రపంచంలో అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా ఎవరైనా వారికి నచ్చిన ఉద్యోగం లేదా నచ్చిన పని చేస్తున్న సమయంలో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ సర్వసాధారణంగా భావించి వాటి గురించి పట్టించుకోరు.

అయితే మీరు ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కూడా ఇదే వర్తిస్తుందని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే, మీరు ఇష్టపడే పనిని లేదా ఉద్యోగాన్ని ఎంచుకున్నారని అనుకుందాం. అయితే అదే సమయంలో మీరు ఎవరితో అయినా ప్రేమలో పడితే మీరు వాటినన్నింటినీ వదులుకుంటారా?

అనే ప్రశ్న ఎదురైతే కొందరు అవును అని.. ఇంకా కొందరు కాదు అని సమాధానాలు చెబుతూ ఉంటారు. అయితే రిలేషన్ షిప్ కోసం మీ గోల్డెన్ కెరీర్ ను ఎందుకు విడిచి పెట్టకూడదనే కొన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎక్కువ ఫ్రీడమ్..
ఈ ప్రపంచంలోని మానవులంతా ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటారు. అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా స్వేచ్ఛగా ఉంటేనే వారి కలలు కన్న జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి స్వతంత్రంగా ఉండటంపై మానసికంగా మరియు ఆర్థిక పరమైన విషయాలపై ఆధారపడగలరా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. స్వతంత్రంగా ఉండటం అనేది వారి ఇష్టానికి అనుగుణంగా వారి జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇతరుల సూచనలను పాటించాల్సిన అవసరం లేదు. మీరే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఆర్థికంగా బలంగా..
మీ జీవితాన్ని మెరుగ్గా ఉంచుకునేందుకు ఉత్తమ మార్గాలలో ఒది ఒకటి. మీరు మీ కోసం డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో ఎన్నో పనులు చేయవచ్చు. అయితే రిలేషన్ షిప్ లో ఉన్న వారు భాగస్వామిని ఆశ్చర్యపరచడం వంటి వాటి కోసం షాపింగ్ వంటి అనవసరమైన ఖర్చులు చేసే బదులు, మీ నైపుణ్యానికి, మీకు అవసరమైన ఆదాయం సంపాదించినప్పుడు, మీరు దాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే కఠినమైన సమయాల్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు.

భవిష్యత్తుకు రక్షణ..
మీరు మీ జీవితంలో ఎక్కువ సమయం మీ కోసం కేటాయించుకున్నప్పుడే, మీరు మీ భవిష్యత్తును రక్షించుకుంటారు. మీ జీవితంలో మెరుగుపడటానికి మీరు 20 ఏళ్ళ వయసులోనే కష్టపడాల్సి వచ్చినప్పటికీ, మీరు జీవితాంతం శాంతియుతంగా జీవించవచ్చు. ఎందుకంటే మీ జీవితం మీకు జీవనోపాధి మరియు భవిష్యత్తు భద్రతను ఇస్తుంది. అయితే రిలేషన్ షిప్ లో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి.

కుటుంబానికి రక్షణగా..
మీరు మీ కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయితే, మీరు మీ పనికి కట్టుబడి ఉండాలి. అలాగే ఉత్తమ అవకాశాల కోసం అన్వేషించాలి. ఎందుకంటే మీరు మీకుటుంబానిక రక్షణగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి ఎలాంటి సమయంలోనూ ముఖ్యంగా లాక్ డౌన్ వంటి సమయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా చూడాలి. అప్పుడే మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. మీ కెరీర్ మరియు ఆదాయం స్థిరంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

అది ఎప్పటికీ వదలదు..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మోసపోవచ్చు. అయితే దీని వల్ల అన్నీ బంధాలు తెగిపోతాయని కాదు. కొంత మంది మాత్రం ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అలాగే వారి భాగస్వాములను మోసం చేస్తుంటారు. వారు ఎప్పటికీ పశ్చాత్తాపపడరు. అది మీరు ఏదైనా పరిశ్రమలో లేదా ఇంకా ఎక్కడైనా పని చేస్తుంటే, మీకు ఎలాంటి సమస్య వచ్చినా భయం అనేది అవసరం ఉండదు. మీ పని అనేది మిమ్మల్ని మరొకరి కోసం ఎప్పటికీ నిరాశపరచదు. మరియు మిమ్మల్ని వదిలిపెట్టదు.

బంధాన్ని బలంగా..
మీరు ఎవరితోనైనా ప్రేమలో పడినట్లయితే మరియు అతను లేదా ఆమెను మీరు బాగా నమ్ముతున్నట్లయితే, మీ సంబంధం కోసం మీరు మీ జీవితాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైన వ్యక్తి మీ కలలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాడు. మీరు మీ అభిరుచిని అనుసరిస్తారని మరియు మీ కలలను కొనసాగించాలని మీరు నిర్ధారించుకుంటారు. సరైన భాగస్వామి ఒక సంబంధం కోసం మీ జీవితాన్ని విడిచిపెట్టమని మిమ్మల్ని ఎప్పటికీ బలవంతం చేయడు.

మీకు గుర్తింపు..
మీ జీవితంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గాలలో ఇది కూడా ఒకటి. ఇలాంటివి మీకు ఎలప్పుడూ గుర్తింపును ఇస్తాయి. మీకు ఒక పేరు, నివసించడానికి స్థలం మరియు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన గుర్తింపు ఉన్నప్పటికీ, మీ నైపుణ్యాలు, సంకల్పం ఆధారంగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందడం అనేది విశేషం. ఈ గుర్తింపు మీకు జీవనోపాధిని ఇవ్వడమే గాక, మీకు సమాజంలో గౌరవం మరియు ప్రశంసలను కూడా ఇస్తుంది.



Click it and Unblock the Notifications