Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
సొంత తమ్ముడి భార్యతోనే అన్న బహిరంగంగా ఆ పని చేయొచ్చు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
సొంత తమ్ముడి ప్రియురాలిని లేదా భార్యను అన్న ఎలాంటి అభ్యంతరం లేకుండా, సమాజం ముందు బహిరంగంగా పెళ్లి చేసుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? వినడానికి ఇది చాలా వింతగా, మన ఆధునిక సామాజిక కట్టుబాట్లకు పూర్తి విరుద్ధంగా అనిపించవచ్చు. కానీ ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ, విలక్షణమైన ఆచారాలకు పెట్టింది పేరైన జపాన్ దేశంలో ఇది ఒకప్పటి సంప్రదాయం.
జపాన్ సంస్కృతిలో పైకి విచిత్రంగా కనిపించే ఎన్నో ఆచారాలు ఉన్నాయి. కానీ వాటిని లోతుగా అధ్యయనం చేస్తే.. వాటి వెనుక అత్యంత బలమైన సామాజిక, కుటుంబ విలువలు దాగి ఉన్నాయని అర్థమవుతుంది. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన ఆచారమే.. పరిస్థితుల ప్రభావం వల్ల తమ్ముడి భాగస్వామిని అన్నయ్య వివాహం చేసుకోవడం.

దీని వెనుక ఉన్న ఇయే వ్యవస్థ
ఈ ఆచారం వెనుక ఉన్న ప్రధాన కారణం జపాన్ పురాతన కుటుంబ వ్యవస్థ. దీనిని జపనీస్ భాషలో ఇయే వ్యవస్థ అని పిలుస్తారు. ఇయే అంటే ఇల్లు లేదా కుటుంబం. ఈ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే కుటుంబం అనే సంస్థకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. వంశాన్ని నిలబెట్టడం, కుటుంబ పేరును కాపాడటం, తరతరాలుగా వస్తున్న ఆస్తులను ఉమ్మడిగా సంరక్షించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
ఒకవేళ దురదృష్టవశాత్తూ తమ్ముడు అకాల మరణం చెందినా, లేదా ఏదైనా కారణం చేత కుటుంబాన్ని వదిలివెళ్లినా..ఆ కుటుంబ బాధ్యతలను ఎవరో ఒకరు స్వీకరించాలి. అటువంటి క్లిష్ట సమయాల్లో, వంశాన్ని మరియు కుటుంబ నిర్మాణాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు, పెద్దవాడైన అన్నయ్య తన తమ్ముడి భార్యను లేదా ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ఈ వ్యవస్థ అనుమతినిచ్చింది.
చరిత్ర ఏం చెబుతోంది?
ఈ ఆచారం ప్రాచీన జపాన్ లో మరీ ముఖ్యంగా ఎడో (Edo) కాలంలో (1603-1867) చాలా సహజంగా ఉండేదని తెలుస్తుంది. ఆ కాలంలో జపనీయులకు తమ ప్రాణం కంటే కుటుంబం, వంశ ప్రతిష్టలే ఎక్కువ. స్త్రీలను కేవలం వ్యక్తులుగా కాకుండా, ఆ ఇంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కుటుంబంలో ఒక అంతర్భాగంగా భావించేవారు.
అందువల్ల నాటి వివాహాలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమకు సంబంధించినవి కావు.. అవి పూర్తిగా కుటుంబ అవసరాలు, ప్రయోజనాల కోసం పెద్దలు కుదిర్చే సామాజిక ఒప్పందాలు.
లెవిరేట్ మ్యారేజ్ ప్రభావం
దీనిని లెవిరేట్ మ్యారేజ్ అని కూడా అంటారు. భర్త మరణించిన తర్వాత, ఒంటరిదైన ఆ స్త్రీకి, ఆమె పిల్లలకు భద్రత కల్పించడం కోసం భర్తకు సంబంధించిన సోదరుడు ఆమెను వివాహం చేసుకోవడం దీని ఉద్దేశ్యం. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆస్తి పరాయి వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆ కుటుంబంలోనే ఉండిపోతుంది.
అలాగే మరణించిన వ్యక్తి పిల్లలకు సొంత రక్తం పంచుకుపుట్టిన వ్యక్తే (పెదనాన్న) తండ్రిగా మారుతాడు కాబట్టి పిల్లల భవిష్యత్తుకు, వారి సామాజిక హోదాకు ఎలాంటి డోకా ఉండదు.



Click it and Unblock the Notifications
