Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
అలసిపోయిన రోజు కూడా..జస్ట్ ఇలా చేస్తే భాగస్వామి ఇక వదలరు!
ఒక అందమైన, ఆరోగ్యకరమైన ప్రేమ బంధానికి మూలస్తంభం..జంటగా నాణ్యమైన సమయాన్ని గడపడమే. కానీ ప్రస్తుత ఆధునిక జీవితంలో ఉరుకులు పరుగులు, ఆఫీసు ఒత్తిళ్లు, ఇంటి బాధ్యతలు మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగానూ అలసిపోయేలా చేస్తున్నాయి.
రోజు పూర్తయ్యేసరికి భాగస్వామితో కనీసం రెండు ముక్కలు ప్రేమగా మాట్లాడే ఓపిక కూడా ఉండటం లేదు చాలామందికి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రముఖ రిలేషన్షిప్ కోచ్ కెవిన్ యాష్ ఫోర్డ్ దీనికి అద్భుతమైన పరిష్కారాలు చూపుతున్నారు.

ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ ఖరీదైన బహుమతులు, లాంగ్ డ్రైవ్ లే అవసరం లేదని, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయని ఆయన చెబుతున్నారు. అలసిపోయిన రోజుల్లోనూ జంటలు సన్నిహితంగా ఉండేందుకు 7 సులభమైన మార్గాలను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
కేవలం 60 సెకన్ల పలకరింపు
భాగస్వామితో మాట్లాడాలంటే గంటల తరబడి లోతైన చర్చలే చేయాల్సిన పనిలేదు. ఈరోజు నీకెలా అనిపిస్తోంది?, ఆఫీసులో అంతా ఓకేనా? అని అడగడానికి ఒక్క నిమిషం చాలు. మీరు ఎంత అలసిపోయి ఉన్నా సరే, ఈ చిన్న పలకరింపు మీ మధ్య అపార్థాలను దూరం చేసి, ఇద్దరినీ మానసికంగా అనుసంధానిస్తుంది.
10 సెకన్ల ఆత్మీయ కౌగిలింత
కొన్నిసార్లు మాటల కంటే స్పర్శకే శక్తి ఎక్కువ. మాట్లాడే ఓపిక లేనప్పుడు, కనీసం ఆత్మీయంగా హగ్ చేసుకోవాలని కెవిన్ సూచిస్తున్నారు. రోజు చివర్లో ఒక 10 సెకన్ల పాటు మీ భాగస్వామిని సైలెంట్ గా, నెమ్మదిగా కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. నేను నీకు తోడుగా ఉన్నాను అనే భరోసాను ఈ కౌగిలింత ఇస్తుంది.
పక్కపక్కనే ఉంటూ..ఎవరి పనుల్లో వారు
ఇద్దరూ ఒకే చోట కూర్చున్నప్పటికీ, ఒకరు పుస్తకం చదువుకోవచ్చు, మరొకరు ఫోన్ చూసుకోవచ్చు లేదా టీవీ చూడొచ్చు. దీన్ని ఒంటరిగా కలిసి ఉండటం అంటారు. ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోకుండా కేవలం పక్కన కూర్చోవడం వల్ల కూడా సంబంధంలో భద్రత, సౌకర్యం, సాన్నిహిత్యం పెరుగుతాయని ఆయన వివరిస్తున్నారు.
చిన్నపాటి శ్రద్ధ..ఎంతో పెద్ద ప్రేమ
చాలా నీరసంగా ఉన్నప్పుడు చిన్నచిన్న పనులే బంధాన్ని సజీవంగా ఉంచుతాయి. చలిగా ఉన్నప్పుడు భాగస్వామికి దుప్పటి కప్పడం, వాటర్ బాటిల్ లో నీళ్లు నింపి ఇవ్వడం లేదా వారు నిద్రపోతున్నప్పుడు లైట్ ఆఫ్ చేయడం లాంటివి నువ్వంటే నాకు ఎంతిష్టమో అని చెప్పకనే చెబుతాయి.
మెచ్చుకోలుతో మురిపించండి
రోజంతా ఎంత కష్టంగా గడిచినా ఆ రోజు జరిగిన ఒక సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోండి. ఇందాక నువ్వు నా కోసం వేడివేడిగా కాఫీ తెచ్చిన విధానం నాకు చాలా నచ్చింది అని మీ భాగస్వామిని ప్రశంసించండి. ఈ కృతజ్ఞతా భావం మనసును తేలికపరిచి, చిరునవ్వులు పూయిస్తుంది.
రోజువారీ పనుల్లో తోడుగా
సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రత్యేకంగా సంభాషణలే అక్కర్లేదు. దినచర్యను పంచుకోండి. రాత్రి పడుకునే ముందు కలిసి పళ్లు తోముకోవడం, ముఖం కడుక్కోవడం, ఇద్దరూ ఒకేసారి మంచం మీదకు చేరడం లాంటివి రోజువారీ జీవితంలో ఆత్మీయతను పునరుద్ధరిస్తాయి.
చేతిలో చేయి వేసి
దీనికి మాటలు వద్దు, ఎలాంటి శ్రమా అవసరం లేదు..కేవలం మీ స్పర్శ ఉంటే చాలు అని కెవిన్ చెబుతున్నారు. నిద్రపోయేముందు ఒకరి చేతిని మరొకరు పట్టుకోండి. ఈ చిన్న చర్య మీ బంధాన్ని బలోపేతం చేసి, ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. కష్టకాలంలోనూ మనమిద్దరం ఒకే జట్టు అనే భావనను కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
