వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!

ప్రతి యేడాది భాద్రపద మాసం చివరి రోజును మహాలయ అమావాస్యగా జరుపుకొంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజును పితృ అమావాస్య లేదా పెత్తన అమావాస్యగా పిలుచుకుంటారు. పూర్వీకుల, పితృ దేవతల తిథి గుర్తు లేని వారు, పితృ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఆ రోజున పితృ తర్పణం, పిండ ప్రదానం, అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వంశాభివృద్ధికి దోహదపడుతుందని పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్‌ 10న మహాలయ అమావాస్య రానుంది. మరి ఆ రోజున పెద్దలకు ఏ సమయంలో తర్పణం చేసుకోవాలి, ఎలా తర్పణం చేయాలి.. పండితుల సూచనలు, సలహాలు తెలుసుకుందాం.

Details date and auspicious time for offering Tarpanam on Mahalaya Amavasya

మహాలయ పక్షం చివరి రోజును పితృదేవతలకు అంకితం చేయడం అనాదిగా వస్తోంది. వారిని ప్రార్థించడం, శ్రాద్ధం చేయడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పితృ అమావాస్య మరుసటి రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు రోజున పూర్వీకులకు తర్పణం, పిండ దానం, శ్రాద్ధం, వారి గుర్తుగా దాన ధర్మాలు చేయడంతో మహాలయ పక్షం ముగుస్తుంది. ఈ పుణ్య కార్యాలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!

ఈ ఏడాది పితృ అమావాస్య ఎప్పుడంటే..

తెలుగు పంచాంగం ప్రకారం 2026లో పితృ అమావాస్యను అక్టోబర్ 10 శనివారం నాడు జరుపుకొంటారు. 9వ తేదీ రాత్రి 9:35 గంటలకు ప్రారంభమై, 10వ తేదీ రాత్రి 9:19 గంటల వరకు అమావాస్య తిథి ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం తర్పణాలు శనివారం నిర్వహిస్తారు.

Details date and auspicious time for offering Tarpanam on Mahalaya Amavasya

శుభ సమయం వివరాలు

పితృ అమావాస్య నాడు శ్రాద్ధం, తర్పణం, కర్మలు చేయడానికి శుభ సమయం వివరాలు.. కుతుప ముహూర్తం అక్టోబర్‌ 10వ తేదీ ఉదయం 11:34 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. రోహిణి ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:07 వరకు ఉండనుంది. మధ్యాహ్న కాలం: మధ్యాహ్నం 1:07 నుండి 3:28 వరకు ఉండగా.. ఈ సమయాలు ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి..ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి..

విధి విధానాలు

మహాలయ అమావాస్య రోజు ఉదయమే తలస్నానం చేసిన తర్వాత, శుభ్రమైన బట్టలు ధరించి, భక్తిశ్రద్ధలతో మీ పూర్వీకులను స్మరించుకోవాలి. కుటుంబ సంప్రదాయం, సామర్థ్యం మేరకు తర్పణం, శ్రాద్ధం, దానధర్మాలు వంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం శ్రేయస్కరం.

నదిలో లేదా ఏదైనా పుణ్యక్షేత్రంలో కూర్చుని, మీ పూర్వీకులను ధ్యానించుకోవాలి. శ్రాద్ధం చేయాలని సంకల్పం చేసుకోవాలి. తర్వాత, నీళ్లలో నల్ల నువ్వులను కలిపి, దక్షిణం వైపు తిరిగి మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి. నదికి వెళ్లడం సాధ్యం కాకపోతే ఈ కర్మను ఇంట్లోనే పూర్తి చేయవచ్చు. బార్లీ, బియ్యం, పాలు, నల్ల నువ్వులతో ఒక ఉండను తయారు చేసి మీ పూర్వీకులకు సమర్పించాలి. శ్రాద్ధ కర్మల తరువాత, బ్రాహ్మణులకు భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టి, మీ శక్తి మేరకు దక్షిణ ఇవ్వవచ్చు. మీరు తెలిసీతెలియక చేసిన తప్పులకు మీ పూర్వీకులను క్షమించమని కోరండి. వారి శాంతి, మోక్షంతో పాటు కుటుంబ సంతోషం, శ్రేయస్సు కోసం ప్రార్థించండి.

Story first published: Monday, October 5, 2026, 15:48 [IST]
Desktop Bottom Promotion